Game Changer OTT Trending: ఎట్టకేలకు ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రం
Game Changer OTT Trending: గేమ్ ఛేంజర్ చిత్రం ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఫస్ట్ ప్లేస్‍లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఏ మాత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకొని చతికిలపడింది. దీంతో నెల తిరగకుండానే ఓటీటీలోకి కూడా వచ్చేంది. ఓటీటీ స్ట్రీమింగ్‍లో గేమ్ ఛేంజర్ మూవీకి వ్యూస్ బాగానే దక్కుతున్నాయి.
టాప్‍లో ట్రెండింగ్
గేమ్ ఛేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. త్వరగానే ఈ మూవీ ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే, ఎట్టకేలకు మూడు రోజులకు ఈ చిత్రం ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. ప్రస్తుతం (ఫిబ్రవరి 11) ప్రైమ్ వీడియోలో గేమ్ ఛేంజర్ టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
గేమ్ ఛేంజర్ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
గేమ్ ఛేంజర్ చిత్రంలో డ్యుయల్ రోల్స్ చేశారు రామ్‍చరణ్. ఏఐఎస్ రామ్‍నందన్, అప్పన్న పాత్రల్లో నటించారు. రెండు క్యారెక్టర్లో యాక్టింగ్‍తో మెప్పించారు. అప్పన్న పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో కియారా అడ్వానీ, అంజలి హీరోయిన్లుగా చేశారు. ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సముద్రఖని, సునీల్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు.
గేమ్ ఛేంజర్ మూవీని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ తెరకెక్కించారు. అయితే, ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందించలేకపోయారు. ఔట్‍డేటెడ్‍గా అనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా ఈ చిత్రం మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద సరైన పర్ఫార్మ్ చేయలేకపోయింది.
గేమ్ ఛేంజర్ కమర్షియల్ ఫెయిల్యూర్
గేమ్ ఛేంజర్ చిత్రం కమర్షియల్‍గా ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీకి రూ.200కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్లే దక్కాయి. ఈ చిత్రం సుమారు రూ.350కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఆ స్థాయిలో వసూళ్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. తిరునావక్కరసు సినిమాటోగ్రఫీ చేశారు.
రెండో ప్లేస్‍లో ది మెహతా బాయ్స్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది మెహతా బాయ్స్ చిత్రం ప్రస్తుతం రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం నేరుగా ఫిబ్రవరి 7న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆరంభంలో ఈ మూవీ భారీ వ్యూస్ సాధించి.. ట్రెండింగ్‍లో టాప్‍కు వెళ్లింది. ఇప్పుడు ఈ మూవీని దాటేసి గేమ్ ఛేంజర్ ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. ది మెహతా బాయ్స్ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో బొమన్ ఇరానీ, అవినాశ్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఎమోషనల్ డ్రామా మూవీకి బొమన్ ఇరానీనే దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం