Game Changer OTT: గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ - రామ్‌చరణ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Game Changer OTT: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అమెజాన్ ప్రైమ్ అప్‌డేట్ ఇచ్చింది. మెగా అన్‌ప్రెడిక్టబుల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలో వెల్లడించనున్నామని అమెజాన్ ప్రైమ్ ఓ ట్వీట్ చేసింది. వాలెంటైన్స్ డే కానుకగా గేమ్ ఛేంజర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Game Changer OTT: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇన్‌డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ అప్‌డేట్ ఇచ్చింది. మెగా అన్‌ప్రెడిక్టబుల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలో ప్రకటించబోతున్నామని అమెజాన్ ప్రైమ్ ఓ ట్వీట్ చేసింది. గేమ్ ఛేంజర్‌లో రామ్‌చరణ్ చెప్పిన డైలాగ్‌తో అమెజాన్ ప్రైమ్ వేసిన ఈ ట్వీట్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించేనని అభిమానులు అంటోన్నారు. ఈ వీక్‌లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు చెబుతోన్నారు.

వాలెంటైన్స్ డే కానుకగా...
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
డిజాస్టర్...
సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో దిల్‌రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్‌పైనే ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, శంకర్ మార్కు స్క్రీన్‌ప్లే మిస్సవ్వడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 180 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాత దిల్‌రాజుకు ఈ మూవీ భారీగానే నష్టాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
రెండు పాత్రల్లో…
గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయినా రామ్‌చరణ్ మాత్రం తన నటనతో అభిమానులను మెప్పించాడు. అప్పన్నగా, ఐఏఎస్ రామ్‌నందన్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో రామ్ చరణ్ కనిపించాడు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటి అని అభిమానులు పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్‌జేసూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.
సీఏం వర్సెస్ ఐఏఎస్ పోరాటం...
నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్‌కు, అవినీతి పరుడైన ముఖ్యమంత్రికి మధ్య జరిగిన పోరాటంతో గేమ్ ఛేంజర్ మూవీ రూపొందింది. ఐపీఎస్ ఆఫీసర్ రామ్‍నందన్ (రామ్‍చరణ్).. సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ అవుతాడు. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతిపరుల ఆట కట్టిస్తుంటాడు. నిజాయితీగా పనిచేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) ఆదేశాలు జారీ చేస్తాడు.
ఒకప్పుడు తాను అప్పన్న (రామ్‍చరణ్)కు చేసిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలచుకొని పశ్చాత్తాపడుతుంటాడు. సత్యమూర్తిని పదవి నుంచి దించేసి కుట్రలతో సీఏం అవుతాడు బొబ్బిలి మోపిదేవి (ఎస్‍జే సూర్య). మోపిదేవి అన్యాయాలు, అక్రమాలకు రామ్ నందన్ అడ్డుగా నిలుస్తాడు. ఈ పోరాటంలో గెలుపు ఎవరిని వరించింది? అప్పన్న, పార్వతిలకు రామ్ నందన్‌తో ఉన్న సంబంధం ఏమిటి? రామ్ నందన్‌ను ప్రేమించిన దీపిక అతడికి ఎందుకు దూరమైంది? అన్నదే గేమ్ ఛేంజర్ మూవీ కథ.