Game Changer OTT Official: 3 రోజుల్లో ఓటీటీలోకి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్- అధికారిక ప్రకటన- ఇక్కడ చూసేయండి!
Game Changer OTT Release Date: ఓటీటీలోకి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మరో మూడు రోజుల్లో గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ తాజాగా విడుదల చేసింది.
Game Changer OTT Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయింది. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ నిర్మాతగా దిల్ రాజు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు. డ్యుయల్ రోల్స్‌లో నటించిన రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. అలాగే, గేమ్ ఛేంజర్ సినిమాలో వీరితోపాటు ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
గేమ్ ఛేంజర్‌కు భారీ బడ్జెట్
భారీ అంచనాల మధ్య జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సుమారు రూ. 350 నుంచి 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ పోటీలో రూ. 180 కోట్ల వరకు కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది గేమ్ ఛేంజర్ సినిమా. దీంతో నిర్మాత దిల్ రాజుకు భారీగానే నష్టమొచ్చినట్లు తెలుస్తోంది.
రూమర్స్‌కు చెక్ పెడుతూ
దీంతో గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అలాగే, గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై పలు రూమర్స్ కూడా వినిపించాయి. అయితే, తాజాగా వాటికి చెక్ పెడుతూ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ మూడు భాషల్లో గేమ్ ఛేంజర్ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. అంటే, జనవరి 10న థియేటర్లలో విడుదలైన గేమ్ ఛేంజర్ నెలలోపే (27 రోజులు) ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
3 రోజుల్లో ఓటీటీలోకి
అంతేకాకుండా మరో మూడు రోజుల్లో ఓటీటీలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సందడి చేయనుంది. అయితే, ఇవాళ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్. మరి థియేటర్లలో ప్లాప్‌గా నిలిచిన గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
గేమ్ ఛేంజర్ స్టోరీ
కాగా గేమ్ ఛేంజర్ సినిమా విశాఖపట్నంకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి రామ్ నందన్ చుట్టూ సాగుతుంది. రాజకీయ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతిని రూపుమాపే పవర్‌ఫుల్ ప్రభుత్వ అధికారిగా రామ్ చరణ్ కనిపించాడు. అవినీతికి పాల్పడే ముఖ్యమంత్రి కుమారుడు, రాజకీయ నాయుకుడు బొబ్బిలి మోపిదేవికి రామ్ నందన్ ఎలా బుద్ధి చెప్పాడనేదే గేమ్ ఛేంజర్ కథ.
సంబంధిత కథనం