టీవీ ఛానెల్‍లోకి గేమ్ ఛేంజర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే-game changer on zee telugu tv channel premiere ram charan political action movie telecast date and time details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  టీవీ ఛానెల్‍లోకి గేమ్ ఛేంజర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే

టీవీ ఛానెల్‍లోకి గేమ్ ఛేంజర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే

Game Changer TV Premiere: గేమ్ ఛేంజర్ చిత్రం టీవీ ఛానెల్‍లోకి రానుంది. ఈ సినిమా టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. ఈ మూవీని టీవీ ఛానెల్‍లో ఎప్పుడు చూడొచ్చంటే..

టీవీ ఛానెల్‍లోకి గేమ్ ఛేంజర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది జనవరి 10న విడుదలైన ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ మూవీకి నిరాశ ఎదురైంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఓటీటీల్లో మోస్తరు వ్యూస్ దక్కాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. టెలికాస్ట్ డేట్, టైమ్ ఫిక్స్ అయ్యాయి.

టెలికాస్ట్ వివరాలివే

గేమ్ ఛేంజర్ చిత్రం ఏప్రిల్ 27వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ వివరాలను ఆ ఛానెల్ అధికారికంగా వెల్లడించింది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊరిస్తూ వస్తోంది జీ తెలుగు. ఎట్టకేలకు ఏప్రిల్ 27న సాయంత్రం 5.30 గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్టు తాజాగా కన్ఫర్మ్ చేసింది.

రెండు ఓటీటీల్లో..

గేమ్ ఛేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలో అడుగుపెట్టింది. హిందీ వెర్షన్ మాత్రం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీకి ప్రైమ్ వీడియోలో మోస్తరు వ్యూస్ దక్కాయి. జీ5లో గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్‍కు అంచనాలకు మించి వ్యూస్ వచ్చాయి. ఓటీటీలో హిందీలో దుమ్మురేపింది ఈ చిత్రం.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ నటించారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాం, సునీల్ కీలోర్స్ చేశారు. ఈ మూవీలో చరణ్ డ్యుయల్ రోల్‍లో మెప్పించారు. అప్పన్న పాత్రకు చాలా ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ శంకర్ ఈ మూవీని అనుకున్న రీతిలో ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించలేకపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ రాలేదు.

గేమ్ ఛేంజర్ బడ్జెట్, కలెక్షన్లు

గేమ్ ఛేంజర్ చిత్రం సుమారు రూ.350కోట్ల బడ్జెట్‍తో రూపొందిందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సుమారు రూ.200కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. భారీ అంచనాలతో వచ్చి ప్లాఫ్ అయింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ సినిమాను ప్రొడ్యూజ్ చేశారు. తమన్ మ్యూజిక్ ఇచ్చారు.

రామ్‍చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలే వచ్చిన గ్లింప్స్ వీడియోతో హైప్ విపరీతంగా పెరిగిపోయింది. రస్టిక్, మాస్‍గా ఉన్న చరణ్ లుక్ ఆకట్టుకుంది. పెద్ది సినిమాను వచ్చే ఏడాది 2026 మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం