Game Changer Sailesh Kolanu: గేమ్ ఛేంజర్ కోసం రంగంలోకి దిగనున్నహిట్ డైరెక్టర్ - శంకర్ స్థానంలో మెగాఫోన్?
Game Changer Sailesh Kolanu: రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ కోసం మరో డైరెక్టర్ రంగంలోకి దిగాడు. హిట్ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
Game Changer Sailesh Kolanu: గేమ్ ఛేంజర్ మూవీ కోసం హిట్, హిట్ -2 మూవీస్ డైరెక్టర్ శైలేష్ కొలను రంగంలోకి దిగబోతున్నాడు. ఈ సినిమాలోని కొన్నీ సీన్స్‌కు శంకర్ స్థానంలో అతడు దర్శకత్వం వహించబోతున్నాడు. గేమ్‌ఛేంజర్ షూటింగ్ మంగళవారం నుంచి హైదరాబాద్‌లో తిరిగి మొదలుకాబోతోంది. ఉపాసన డెలివరీ కోసం దాదాపు నెలన్నర పాటు ఈ సినిమా షూటింగ్‌కు గ్యాప్ తీసుకున్నాడు చరణ్(Ram Charan).
ట్రెండింగ్ వార్తలు
తండ్రిగా ప్రమోషన్ పొందిన క్షణాల్ని ఇన్నాళ్లు ఆనందంగా ఎంజాయ్ చేసిన అతడు మంగళవారం నుంచి తిరిగి కెమెరా ముందుకు రాబోతున్నాడు. దాదాపు ఎనిమిది నుంచి పది రోజుల పాటు సాగనున్న ఈ కొత్త షెడ్యూల్‌లో అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్‌లో రామ్‌చరణ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను డైరెక్టర్ శంకర్ తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్ అన్భు అరివు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. స్టైలిష్‌గా సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరున మరో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌కు శంకర్ స్థానంలో హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది.
గేమ్ ఛేంజర్ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా శైలేష్ కొలను వ్యవహరిస్తన్నాడు. శంకర్ మార్గదర్శకత్వంలో రఘుబాబు, రాకెట్ రాఘవతో పాటు మరికొంత మంది నటీనటులపై వచ్చే కామెడీ సీన్స్‌ను శైలేష్ కొలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయడానికే శైలేష్ కొలనుకు దర్శకత్వ బాధ్యతల్ని అప్పగించాలని శంకర్, నిర్మాత దిల్‌రాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పొలిటికల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా పాన్ ఇండియన్ లెవెల్‌లో గేమ్‌ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, సునీల్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.