Game Changer Pre Release: నేడే గేమ్ ఛేంజర్ ‘మెగా పవర్ ఈవెంట్’.. పవన్ కల్యాణ్ ప్రసంగంపై విపరీతమైన ఆసక్తి
Game Changer Pre Release: గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు భారీస్థాయిలో జరగనుంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ హాజరవుతున్న తొలి సినీ ఈవెంట్ ఇదే. దీంతో ఈ ఈవెంట్‍పై ఆసక్తి విపరీతంగా ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం భారీస్థాయిలో రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే వచ్చిన ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచింది. ఈ సినిమా బిగ్గెస్ట్ ఈవెంట్ నేడు (జనవరి 4) జరగనుంది. నేటి సాయంత్రం గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సాగనుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
పదవి చేపట్టాక పవన్‍కు తొలి సినీ ఈవెంట్
గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ కార్యక్రమం ‘మెగా పవర్ ఈవెంట్’ పేరుతో జరగనుంది. రాజమంత్రి వేదికగా నేటి (జనవరి 4) సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గతేడాది పదవి చేపట్టిన తర్వాత.. పవన్ హాజరవుతున్న తొలి సినిమా ఈవెంట్ ఇదే కానుంది. ఈ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం భారీ బందోబస్తు ఉండనుంది.
ఏం మాట్లాడతారు?
గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో పవన్ ప్రసంగంపై అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచనలమైంది. ఆ తర్వాత టాలీవుడ్‍లో చాలా పరిణామాలు జరిగాయి. హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ.. ఏపీకి కావాలని కూడా కొందరు మాట్లాడారు. ఏపీ వైపు టాలీవుడ్ చూడాలనేలా ఓ దశలో పవన్ అన్నారు. దీంతో గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ అంశం గురించి ఏమైనా మాట్లాడతారా.. ఇండస్ట్రీకి ఏవైనా సూచనలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఆయన ఇటీవలే స్పందించారు. మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారా అనేది చూడాలి. డిప్యూటీ సీఎం అయ్యాక పాల్గొంటున్న తొలి సినీ కార్యక్రమం కావడంతో చాలా ఇంట్రెస్ట్ నెలకొని ఉంది.
టాలీవుడ్ అంతా..
తన హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల గురించి గేమ్ ఛేంజర్ ఈవెంట్‍లో పవన్ కల్యాణ్ ఏమైనా చెబుతారా అనేది కూడా ఆసక్తికరమైన విషయమే. పవన్ స్పీచ్ కోసం సినీ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ అంతా ఉత్కంఠతో ఉంది. మరి పవన్ ఏం మాట్లాడతారో చూడాలి.
గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్లు దూకుడుగా సాగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‍లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అతిథిగా వచ్చారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు పవన్ వస్తున్నారు. చెన్నైలో జరిగే తమిళ వెర్షన్ ఈవెంట్‍కు స్టార్ హీరో దళపతి విజయ్ అతిథిగా పాల్గొననున్నారు. జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది.
గేమ్ ఛేంజర్ మూవీలో ఏఐఎస్ ఆఫీసర్‌గా, ఫ్లాష్ బ్యాక్‍లో రాజకీయ నేతగా తండ్రీకొడుకుల పాత్రల్లో డ్యుయల్ రోల్స్ చేశారు రామ్‍చరణ్. ఈ చిత్రంలో కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటించారు. అంజలి ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీరోల్స్‌లో కనిపించారు. ఈ మూవీని దిల్‍రాజు, శిరీష్ నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం
టాపిక్