Game Changer Leaked: గేమ్ ఛేంజర్ మూవీ లీక్.. రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లోకి.. డౌన్‌లోడ్ చేశారో ఇక అంతే..-game changer movie leaked online hours after its theatrical release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Leaked: గేమ్ ఛేంజర్ మూవీ లీక్.. రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లోకి.. డౌన్‌లోడ్ చేశారో ఇక అంతే..

Game Changer Leaked: గేమ్ ఛేంజర్ మూవీ లీక్.. రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లోకి.. డౌన్‌లోడ్ చేశారో ఇక అంతే..

Hari Prasad S HT Telugu
Jan 10, 2025 02:23 PM IST

Game Changer Leaked: గేమ్ ఛేంజర్ మూవీ కూడా పైరసీ బారిన పడింది. థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే ఈ మూవీ ఆల్‌లైన్లోకి వచ్చేసింది. అయితే ఈ పైరసీ వెర్షన్ ను మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మాత్రం కొన్ని చిక్కుల్లో పడినట్లే అని గుర్తుంచుకోండి.

గేమ్ ఛేంజర్ మూవీ లీక్.. రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లోకి.. డౌన్‌లోడ్ చేశారో ఇక అంతే..
గేమ్ ఛేంజర్ మూవీ లీక్.. రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లోకి.. డౌన్‌లోడ్ చేశారో ఇక అంతే..

Game Changer Leaked: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ శుక్రవారం (జనవరి 10) థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్లో లీకైంది. ఈమధ్య రిలీజ్ అవుతున్న చాలా సినిమాల్లాగే ఈ మూవీ కూడా పైరసీ బారిన పడింది. హెచ్‌డీ క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసుకునేలా ఈ మూవీ కొన్ని పైరసీ సైట్లలో అందుబాటులోకి రావడం మేకర్స్ ను షాక్ కు గురి చేస్తోంది. పైరసీ భూతం మరోసారి ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పెద్ద సవాలే విసిరింది.

yearly horoscope entry point

గేమ్ ఛేంజర్ మూవీ లీక్

మూడేళ్లుగా ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ మొత్తానికి సంక్రాంతి సందర్భంగా శుక్రవారం (జనవరి 10) థియేటర్లలోకి వచ్చేసింది. కానీ చరణ్ అభిమానులకు ఆ సంబరం ఎక్కువసేపు నిలవలేదు. కొన్ని గంటల్లోనే మూవీ మొత్తం ఆన్‌లైన్ లో లీకైంది. తమిళ్‌రాకర్స్, మూవీరూల్స్, ఫిల్మీజిల్లా, టెలిగ్రాంలాంటి వాటిలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

దీంతో గేమ్ ఛేంజర్ మూవీ డౌన్‌లోడ్, గేమ్ ఛేంజర్ ఫ్రీ హెచ్‌డీ డౌన్‌లోడ్ సెర్చ్‌లు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. గతేడాది డిసెంబర్ లో రిలీజైన పుష్ప 2 మూవీకి కూడా ఈ పైరసీ సమస్య ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా దీనిని తప్పించుకోలేకపోయింది.

గేమ్ ఛేంజర్ డౌన్‌లోడ్ చేసుకున్నారో..

పైరసీని కట్టడి చేయడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా అది మాత్రం ఆగడం లేదు. అయితే పైరసీ సైట్లలో మూవీ ఉంది కదా అని డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది జాగ్రత్త. ఇలాంటి కంటెంట్ ను డౌన్లోడ్ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని వెబ్‌సైట్లు ఇలాంటి లింకుల ద్వారా సైబర్ దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది.

దీనివల్ల మీ కంప్యూటర్లో ఉన్న విలువైన డేటా కోల్పోవచ్చు. ఇక మరికొందరు ఇలాంటి వాటిని ఎరగా వేసి ఆర్థిక మోసాలకు కూడా పాల్పడే అవకాశం ఉంటుందని గమనించండి. ఎలాంటి అనుమానాస్పద లింక్స్ పైనా క్లిక్ చేయొద్దు. సైబర్ దాడులకు ఒకరకంగా ఇలాంటి సినిమాల పైరసీ వెర్షన్ల లింకులను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు.

గేమ్ ఛేంజర్ ఎలా ఉందంటే?

గేమ్ ఛేంజర్ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు మూవీ మెగా హిట్ అంటుంటే.. మరికొందరు మాత్రం శంకర్ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ అంటూ నిట్టూరుస్తున్నారు. అయితే రామ్ చరణ్ నటనకు మాత్రం అందరూ మంచి మార్కులు వేస్తున్నారు.

ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీల్లోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మిగిలిన భాషల్లో అంతగా రావడం లేదు.

Whats_app_banner