Game Changer Jaragandi Song: జరగండి పాటకు రెస్పాన్స్ అంతంతమాత్రమే.. ఇప్పటి వరకూ వచ్చిన వ్యూస్ ఎన్నో తెలుసా?
Game Changer Jaragandi Song: రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి వచ్చిన మచ్ అవేటెడ్ సాంగ్ జరగండికి ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. తొలి 24 గంటల్లో చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి.
Game Changer Jaragandi Song: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా నుంచి ఐదు నెలలుగా ఊరిస్తూ వచ్చిన జరగండి సాంగ్ మొత్తానికి చరణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం (మార్చి 27) రిలీజైంది. అయితే తొలి 24 గంటల్లోనే మేకర్స్ ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఉసూరుమన్నారు.
జరగండి పాటను జరిపేసిన ఆడియెన్స్
గేమ్ ఛేంజర్ మూవీ కోసం చరణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నారు. షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుండటంతో వాళ్లు సహనం కోల్పోతున్నారు. చివరికి మూవీ నుంచి ఒక్క పాట రిలీజ్ చేయడానికి కూడా మేకర్స్ కు ఐదు నెలల సమయం పట్టింది. గతేడాది దీపావళి సందర్భంగా వస్తుందనుకున్న పాట.. చెర్రీ బర్త్ డేనాడు రిలీజైంది. అయితే ఎంతో ఊరించిన ఈ పాట చివరికి తుస్సుమనిపించింది.
తమన్ రొటీన్ మ్యూజిక్ ఈ పాటకు శంకర్ అండ్ టీమ్ పెట్టిన భారీ బడ్జెట్ కు న్యాయం చేయలేకపోయింది. ప్రభుదేవాలాంటి కొరియోగ్రాఫర్ ఉన్నా కూడా రామ్ చరన్, కియారా స్టెప్స్ కూడా సో సోగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ పాట ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదని తొలి 24 గంటల్లోనే వచ్చిన వ్యూస్ తోనే అర్థమైపోయింది. బుధవారం ఉదయం 9 గంటలకు రిలీజైన ఈ పాటకు గురువారం ఉదయానికి వచ్చిన వ్యూస్ 4.5 మిలియన్లు మాత్రమే.
రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్.. గేమ్ ఛేంజర్ మూవీపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఈ పాటకు వచ్చిన వ్యూస్ చాలా తక్కువే అని చెప్పాలి. ఇక హిందీ, తమిళంలలో అయితే మరీ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక దాంట్లో 3 లక్షలు, మరోదాంట్లో 5 లక్షల వ్యూస్ తో సరిపెట్టుకుంది. ఇది నిజంగా చరణ్ తోపాటు మేకర్స్ కు షాకింగ్ లాంటిదే.
రెహమాన్‌ను మిస్ అయ్యారా?
ఇన్నాళ్లూ శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ప్రధాన బలంగా ఉండేది. కానీ ఈ గేమ్ ఛేంజర్ కు అదే మిస్ అవుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద హీరో సినిమాకు అతడే మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో ఒకరకంగా తమన్ మ్యూజిక్ రొటీన్ అయిపోయింది.
జరగండి పాటను అది కూడా ఓ రకంగా దెబ్బతీసినట్లే కనిపిస్తోంది. ఈ పాట కోసమా ఇన్నాళ్లు వేచి చూసింది అన్నట్లు ఫ్యాన్స్ రెస్పాన్స కనిపిస్తోంది. సాధారణంగా శంకర్ సినిమాల్లో ఉండే భారీతనం ఈ పాటలోనూ ఉంది. దీనికోసం భారీ ఖర్చు కూడా పెట్టారు. చివరికి సాంగ్ మాత్రం ఊహించిన రేంజ్ లో లేదు. మరోవైపు కొన్ని నెలల కిందటే ఈ సాంగ్ లీకవడం కూడా దెబ్బతీసింది.
ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయానికి వస్తే మరో నాలుగైదు నెలలు వేచి చూడాల్సిందే అని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశాడు. షూటింగ్ కే మరో రెండు నెలలు పడుతుందని అతడు వెల్లడించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడని, అందుకే డైరెక్టర్ శంకర్ ఈ మూవీలోని ప్రతి సాంగ్, ప్రతి సీన్ ను చాలా జాగ్రత్తగా తీస్తున్నట్లు అతడు తెలిపాడు.
టాపిక్