Game Changer Collection Day 1: గేమ్ ఛేంజర్‌కు తొలి రోజు 120 కోట్ల కలెక్షన్స్- పుష్ప 2లో సగమే! ఓవర్సీస్‌లో వచ్చింది ఇంతే!
Game Changer Day 1 Worldwide Box Office Collection: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఇవాళ (జనవరి 10) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మొదటి రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ ఎంత అనేదానిపై క్యూరియాసిటీ నెలకొంది. కాబట్టి, అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి గేమ్ ఛేంజర్ డే 1 కలెక్షన్స్ ఎంతో చూద్దాం.
Game Changer Box Office Collection Day 1: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ ఛేంజర్. సుమారు ఐదేళ్ల తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఇవాళ (జనవరి 10) ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ డే 1 కలెక్షన్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్ వైడ్‌గా 6600కిపైగా థియేటర్లలో విడుదల కాగా.. రూ. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అయితే, గేమ్ ఛేంజర్ సినిమాకు ఇండియాలో రూ. 40 కోట్ల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం.
గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్
వాటిలో తమిళం నుంచి రూ. 54 లక్షలు, హిందీ బుకింగ్స్ రూ. 2.14 కోట్లు, తెలుగులో రూ. 16 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో పది కోట్లుకుపైగా గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్స్ తెలిపాయి. ఇలా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గేమ్ ఛేంజర్‌కు రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు
ఇక తొలి రోజు కూడా గేమ్ ఛేంజర్‌కు మంచి ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున గేమ్ ఛేంజర్‌కు రూ. 65 నుంచి 70 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, హిందీలో దేవర పార్ట్ 1 కంటే మెరుగ్గా గేమ్ ఛేంజర్ బుకింగ్స్ ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటకలో కూడా డీసెంట్‌గా ఉండగా.. కేరళలో కాస్తా వీక్‌గా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు లెక్కలు వేశారు.
ఇండియాలో కలెక్షన్స్
ఇలా ఓవరాల్‌గా గేమ్ ఛేంజర్ ట్రెండ్‌ను బట్టి ఇండియాలో రూ. 90 నుంచి 95 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్‌ను సినిమా రాబట్టే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఓవర్సీస్‌లో డే 1 గేమ్ ఛేంజర్‌కు రూ. 22 నుంచి 25 కోట్ల గ్రాస్ రానుందని తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఓపెనింగ్ రోజున వరల్డ్ వైడ్‌గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రూ. 110 నుంచి 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టనుందని అంచనా వేశారు.
పుష్ప 2 కంటే తక్కువే
ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమా డే 1 నాడు వరల్డ్ వైడ్‌గా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్‌లో గేమ్ ఛేంజర్‌కు సగం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం