Game Changer Climax: అదిరిపోనున్న గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్.. 1200 మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్-game changer climax to be huge with 1200 fighters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Climax: అదిరిపోనున్న గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్.. 1200 మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్

Game Changer Climax: అదిరిపోనున్న గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్.. 1200 మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్

Hari Prasad S HT Telugu

Game Changer Climax: అదిరిపోనుంది గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్. 1200 మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ షూటింగ్ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది.

గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్

Game Changer Climax: డైరెక్టర్ శంకర్ ఏది చేసినా అది భారీగానే ఉంటుంది. అతని సినిమాలు భారీతనానికి కేరాఫ్. 30 ఏళ్ల కిందటి జెంటిల్మన్ నుంచి ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, రోబో, 2.0 లాంటి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే. ఇక ఇప్పుడు అతని డైరెక్షన్ లో మరో రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కాగా.. మరొకటి కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2.

ఈ మధ్యే ఇండియన్ 2 సౌతాఫ్రికా షెడ్యూల్ పూర్తి చేసిన శంకర్.. గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్ చిత్రీకరించనున్నట్లు చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒకే పాటకు రూ.40 కోట్లు ఖర్చు పెట్టారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్లైమ్యాక్స్ కోసం కూడా శంకర్ భారీ ప్లాన్ చేశాడు. ఏకంగా 1200 మంది ఫైటర్లతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నాడు.

దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేశారు. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తోపాటు విలన్ ఎస్‌జే సూర్య కూడా ఏప్రిల్ 23 నుంచి పాల్గొననున్నారు. మూవీలో కీలకమైన క్లైమ్యాక్స్ ను ఈ షెడ్యూల్లో పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ గేమ్ ఛేంజర్ షూటింగ్ కు పదే పదే బ్రేకులు పడుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ కూడా తండ్రి కానుండటంతో ఉపాసనతో కలిసి ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాడు.

దీంతో ఈ షెడ్యూల్ లోనే గేమ్ ఛేంజర్ మూవీ మేజర్ సీన్లను తీసేయాలని శంకర్ భావిస్తున్నాడు. మే నెలలో మరోసారి ఇండియన్ 2 షూటింగ్ మొదలుపెట్టనున్నాడు శంకర్. అందుకే ఈ షెడ్యూల్ గేమ్ ఛేంజర్ కు కీలకం కానుంది. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఉన్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత కథనం