Game Changer Collection: చతికిలపడిన గేమ్ ఛేంజర్- 7 డేస్ కలెక్షన్స్- వెంకటేష్, బాలకృష్ణను దాటి రామ్ చరణ్‌కు హిట్ కష్టమే!
Game Changer Worldwide Box Office Collection Day 7: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడినట్లుగా తెలుస్తోంది. రోజు రోజు భారీగా వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి. దాదాపుగా రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.
Game Changer 7 Days Box Office Collection: వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్-కియారా అద్వానీ జంటగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్. దక్షిణాది స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ షణ్ముగం తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే గేమ్ ఛేంజర్.
తగ్గుముఖం
2025 సంక్రాంతికి మొట్ట మొదటగా బరిలోకి దిగిన గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్స్ చతికిలపడినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాల కంటే ముందుగా జనవరి 10న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాకు రోజు రోజు కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి. మూవీపై నెలకొన్న అంచనాలను ఏమాత్రం అందుకోవడం లేదు.
40 శాతం డ్రాప్
సంక్రాంతి సినిమాల్లో గేమ్ ఛేంజర్ మూడో ఆప్షన్‌గా మిగిలినట్లు తెలుస్తోంది. ఇకపోతే జనవరి 16తో మొదటి వారంలోకి అడుగుపెట్టింది గేమ్ ఛేంజర్ సినిమా. ఏడో రోజున గేమ్ ఛేంజర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఏడో రోజున ఆన్‌లైన్ టికెట్ సేల్స్‌లో 35 నుంచి 40 శాతం డ్రాప్ అయినట్లు సమాచారం.
3 కోట్ల రేంజ్‌లో
ఆఫ్‌లైన్‌లో మాత్రం గేమ్ ఛేంజర్ బాగానే నడుస్తోందట. ఈ ట్రెండ్‌ను బట్టీ 7వ రోజున ఏపీ, తెలంగాణలో రెండు కోట్లకు అటు ఇటుగా కలెక్షన్స్ రావొచ్చనే అంచనా వేశారు. ఆఫ్‌లైన్ లెక్కలు బాగుంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్‌గా గేమ్ ఛేంజర్‌కు 7వ రోజున రూ. 2.7 నుంచి 3 కోట్ల రేంజ్‌లో షేర్ వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి.
భారీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్
హిందీలో కలెక్షన్స్ పర్వాలేదనిపించినా.. మిగిలిన చోట్ల చాలా వరకు డ్రాప్ కొనసాగుతోందట. ఈ లెక్కన రూ. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను గేమ్ ఛేంజర్ అందుకోవడం కష్టమే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గేమ్ ఛేంజర్ సినిమాకు ఇండియాలో ఆరో రోజున 30 శాతం కలెక్షన్స్ పడిపోగా.. ఏడో రోజున రూ. 3.55 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సక్నిల్క్ సంస్థ పేర్కొంది.
7 రోజుల కలెక్షన్స్
ఇక వారం రోజుల్లో ఇండియాలో గేమ్ ఛేంజర్ సినిమాకు రూ. 116.7 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని సక్నిల్క్ వెల్లడించింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా వారం రోజుల్లో రూ. 190 కోట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, తొలి రోజే గేమ్ ఛేంజర్‌కు 186 కోట్లు వచ్చినట్లు మూవీ టీమ్ పేర్కొంది. దాంతో ట్రోలింగ్ జరిగింది. తర్వాత కలెక్షన్స్ వివరాలను మూవీ టీమ్ వెల్లడించట్లేదు.
45 శాతమే రికవరీ
కాకపోతే గేమ్ ఛేంజర్ సినిమాకు ఇప్పటికీ 45 శాతం వరకు రికవరీ అయినట్లు తెలుస్తోంది. అలాగే, రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ హిట్ కొట్టాలంటే ఇంకా రూ. 120 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. కానీ, అన్ని కోట్లను వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీస్‌ను దాటి అందుకోవడం కష్టమే అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత కథనం