Gadar 2 Trp: 700 కోట్ల బాలీవుడ్ మూవీని తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు - మరీ ఇంత తక్కువ టీఆర్‌పీ రేటింగా!
Gadar 2 Trp: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ గదర్ 2 తెలుగులో చెత్త రికార్డును మూటగట్టుకున్నది. తెలుగులోకి డబ్ అయిన బాలీవుడ్‌మూవీస్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది.
Gadar 2 Trp: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ గదర్ 2కు తెలుగు ఆడియెన్స్ షాకిచ్చారు. తెలుగులో డబ్ అయిన బాలీవుడ్ మూవీస్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నసినిమాగా గదర్ 2 చెత్త రికార్డును మూట గట్టుకున్నది. గదర్ 2 మూవీ తెలుగులో ఇటీవల జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. గదర్ 2 తెలుగు వెర్షన్‌కు అర్భన్ ఏరియాలో 1.77 టీఆర్‌పీ రేటింగ్ రాగా...అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో కలిపి 1.31 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.
బాలీవుడ్‌లో ఏడు వందల కోట్లు...
గత ఏడాది బాలీవుడ్‌లో రిలీజైన గదర్ 2 మూవీ 691 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 2023లో ఇండియా వైడ్‌గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఎనిమిదో మూవీగా గదర్ 2 నిలిచింది. అరవై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 691 కోట్ల కలెక్షన్స్‌తో అదరగొట్టింది. కలెక్షన్స్ పరంగా బాలీవుడ్‌లో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమాను తెలుగులో మాత్రం ఎవరూపెద్దగా పట్టించుకోలుదు. బుల్లితెరపై డిజాస్టర్‌గా మిగిలింది.
గదర్ మూవీకి సీక్వెల్...
2001లోరిలీజైన గదర్ ఏక్ ప్రేమ్‌కథకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సన్నీడియోల్, ఉత్కర్ష్ శర్మ హీరోలుగా నటించారు. అమీషాపటేల్, సిమ్రత్ కౌర్ హీరోయిన్లుగా కనిపించారు. గదర్ మూవీలో జంటగా నటించిన సన్నీడియోల్, అమీషాపటేల్ సీక్వెల్‌లో అవే పాత్రలు చేశారు.
గదర్ 2 కథ ఇదే...
1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీకి సహాయం చేయబోయి శత్రువులకు బందీగా చిక్కుతాడు తారా సింగ్ (సన్నీడియోల్). పాకిస్థాన్ జైలులో ఉన్న తారా సింగ్‌ను ఎలాగైనా విడిపించాలని అతడి కొడుకు చరణ్‌జీత్‌సింగ్ (ఉత్కర్ష్ శర్మ) నిర్ణయించుకుంటాడు. దొంగ పాస్‌పోర్ట్‌తో పాకిస్థాన్ వెళతాడు. తండ్రిని చరణ్‌జీత్ జైలు నుంచి విడిపించాడా? పాకిస్థాన్‌లో తారాసింగ్, చరణ్‌జీత్ సింగ్‌లకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి అన్నదే ఈ సినిమా కథ.
అమెజాన్ ప్రైమ్...
గదర్ 2 మూవీ కథతో పాటు సన్నీడియోల్, ఉత్కర్ష్ శర్మపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలను అభిమానులను ఆకట్టుకున్నాయి. గదర్ 2 మూవీకి అనిల్ శర్మ దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాతల్లో ఆయన ఒకరిగా వ్యవహరించాడు. అనిల్ శర్మ కొడుకు ఉత్కర్ష్ శర్మ ఈ సినిమాలో హీరోగా నటించాడు. గదర్ 2 మూవీ హిందీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 దక్కించుకున్నది. తెలుగు వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అన్నదమ్ములు ఒకేసారి...
ఒకప్పుడు బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోగాలుగా పేరు తెచ్చుకున్నారు సన్నీడియోల్, బాబీడీయోల్. యంగ్ హీరోల పోటీ కారణంగా వెనుకబడిపోయిన ఈ అన్నదమ్ములు గత ఏడాది తిరిగి విజయాల బాట పట్టారు. గదర్ 2తో హీరోగా సన్నీడియోల్ చాలా ఏళ్ల తర్వాత బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. అతడి తమ్ముడు బాబీడియోల్ యానిమల్ మూవీలో విలన్‌గా తన నటనతో అభిమానులను మెప్పించాడు. రణ్‌బీర్‌కపూర్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది.