Gadar 2 OTT Release Date: గదర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. చాలా ముందుగానే వచ్చేస్తోంది-gadar 2 ott release date confirmed when and where to watch the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Gadar 2 Ott Release Date Confirmed When And Where To Watch The Movie

Gadar 2 OTT Release Date: గదర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. చాలా ముందుగానే వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu
Sep 13, 2023 02:11 PM IST

Gadar 2 OTT Release Date: గదర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అయితే ఊహించినదాని కంటే చాలా ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుండటం విశేషం.

గదర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్
గదర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

Gadar 2 OTT Release Date: గదర్ 2 మూవీ ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 11న గదర్ 2 మూవీ రిలీజైన విషయం తెలిసిందే. తొలి రోజు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్ము రేపింది.

ట్రెండింగ్ వార్తలు

గదర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన అభిమానులకు జీ5 (zee5) ఓటీటీ ఓ గుడ్ న్యూస్ చెప్పిది. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. నిజానికి ఆరు నెలల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని మేకర్స్ రిలీజ్ సమయంలో వెల్లడించారు.

కానీ రెండు నెలలలోపే గదర్ 2ను జీ5 ఓటీటీ స్ట్రీమ్ చేస్తోంది. అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. 22 ఏళ్ల కిందట అంటే 2001లో వచ్చిన గదర్ మూవీ ఏ స్థాయిలో విజయం సాధించిందో గదర్ 2 అంతకంటే ఎక్కువే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తారా సింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా పటేల్) లవ్ స్టోరీ గదర్ లో ప్రేక్షకుల మనసును తాకింది.

ఆ సినిమా 1947లో దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కగా.. తాజాగా గదర్ 2 మూవీ 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తీశారు. ఈసారి తన కుటుంబం, తన దేశం కోసం తారా సింగ్ శత్రువులతో పోరాడటం ఈ మూవీలో చూడొచ్చు. గదర్ ను డైరెక్ట్ చేసిన అనిల్ శర్మే ఈ గదర్ 2ను కూడా డైరెక్ట్ చేశాడు.

ఆగస్ట్ 11న రిలీజైన ఈ మూవీ.. టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.550 కోట్లు వసూలు చేయడం విశేషం. గదర్ 2 సూపర్ డూపర్ హిట్ అవడంతో గదర్ 3 కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్నీ డియోల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించినా.. ఎప్పటి నుంచి మొదలవుతుందన్నది మాత్రం చెప్పలేదు. ఇక గదర్ మూవీ కూడా జీ5 ఓటీటీలోనే 4కే క్వాలిటీలో స్ట్రీమ్ అవుతుండటం విశేషం.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.