Gabbar Singh Re Release: గ‌బ్బ‌ర్‌సింగ్ ర్యాంపేజ్ - ప‌వ‌ర్‌స్టార్‌ దెబ్బ‌కు మ‌హేష్, ప్ర‌భాస్‌ రికార్డులు మ‌టాష్-gabbar singh re release collections pawan kalyan movie breaks mahesh ntr records ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gabbar Singh Re Release: గ‌బ్బ‌ర్‌సింగ్ ర్యాంపేజ్ - ప‌వ‌ర్‌స్టార్‌ దెబ్బ‌కు మ‌హేష్, ప్ర‌భాస్‌ రికార్డులు మ‌టాష్

Gabbar Singh Re Release: గ‌బ్బ‌ర్‌సింగ్ ర్యాంపేజ్ - ప‌వ‌ర్‌స్టార్‌ దెబ్బ‌కు మ‌హేష్, ప్ర‌భాస్‌ రికార్డులు మ‌టాష్

Nelki Naresh Kumar HT Telugu
Sep 04, 2024 10:51 AM IST

Gabbar Singh Re Release: టాలీవుడ్‌ రీ రిలీజ్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ‌బ్బ‌ర్ సింగ్‌ ఏడు కోట్ల యాభై మూడు ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నైజాంలో మొద‌టిరోజు ఈ సినిమా 2.90 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది.

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కలెక్షన్స్
గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కలెక్షన్స్

Gabbar Singh Re Release: రీ రిలీజ్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్‌సింగ్ స‌రికొత్త రికార్డును సృష్టించింది. తెలుగులో రీ రిలీజ్ సినిమాల్లో తొలిరోజు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీ నిలిచింది. మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ సినిమాల రికార్డుల‌ను గ‌బ్బ‌ర్‌సింగ్ తుడిచేసింది. తొలిరోజు గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏడు కోట్ల యాభై మూడు ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు 4.40 కోట్ల‌తో మ‌హేష్‌బాబు మురారి టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతూ వ‌చ్చింది.

మురారి రికార్డ్‌ను ప‌వ‌న్ మూవీ దాటేసింది. మురారి కంటే మూడు కోట్లు ఎక్కువే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫ‌స్ట్ డే 5.95 కోట్ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి రోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా గ‌బ్బ‌ర్ సింగ్ చ‌రిత్ర‌ను సృష్టించింది.

నైజాం ఏరియాలో...

గ‌బ్బ‌ర్ సింగ్ మూవీకి ఫ‌స్ట్ డే నైజాం ఏరియాలో దాదాపు 2.90 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చాయి. రీ రిలీజ్ సినిమాల్లో నైజాం ఏరియాలో తొలి రోజు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సెకండ్ మూవీగా కూడా గ‌బ్బ‌ర్ సింగ్ నిలిచింది. ఈ జాబితాలో మ‌హేష్‌బాబు మురారి 2.92 కోట్ల‌తో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంది. సీడెడ్ ఏరియాలో గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ తొలిరోజు 81 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఈస్ట్ గోదావ‌రిలో 46 ల‌క్ష‌లు, వెస్ట్ గోదావ‌రి 40 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌వ‌ర్‌స్టార్ మూవీకి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

రీ రిలీజుల్లో తొలిరోజు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ తెలుగు మూవీస్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు సినిమాలు, మ‌హేష్‌బాబు రెండు సినిమాలు ఉన్నాయి. వ‌ర్షాల ప్ర‌భావంతో గ‌బ్బ‌ర్ సింగ్ సెకండ్ డే వ‌సూళ్లు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ద‌బాంగ్ రీమేక్‌...

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్ బాలీవుడ్ మూవీ ద‌బాంగ్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ 2012లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 105 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ప‌వ‌న్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది.

ఈ సినిమాలో గ‌బ్బ‌ర్ సింగ్‌గా ప‌వ‌న్ ఆటిట్యూడ్‌, మ్యాన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా కోసం దేవిశ్రీప్ర‌సాద్ అందించిన పాట‌లు మెగా ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఊపు ఊపేశాయి. గ‌బ్బ‌ర్ సింగ్ మూవీకి సీక్వెల్‌గా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌లేక‌పోయింది.

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌...

ప్ర‌స్తుతం గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ళ్యాణ్, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ రాబోతోంది. త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన తేరీ మూవీకి రీమేక్‌గా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రూపొందుతోంది.

ప్ర‌స్తుతం ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో పాటు సుజీత్ ఓజీ, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాల్లో ప‌వ‌న్ న‌టిస్తున్నాడు. అయితే ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌తో ప‌వ‌న్ బిజీగా ఉండ‌టంతోఈ సినిమా షూటింగ్‌లు చాలా కాలంగా నిలిచిపోయాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌ల‌ను ప‌వ‌న్ తిరిగి మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.