Gabbar Singh Re-release Date: మళ్లీ థియేటర్లలోకి గబ్బర్ సింగ్ సినిమా.. ఆ స్పెషల్ డే రోజున..
Gabbar Singh Re-release Date: గబ్బర్ సింగ్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ రీ-రిలీజ్ డేట్ ఖరారైంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజున ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కొన్నేళ్లపాటు వరుసగా ప్లాఫ్‍లు ఎదురైన సమయంలో ఆ మూవీ బంపర్ బ్లాక్‍బస్టర్ కొట్టింది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్ అయింది. పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకులను ఊపేశాయి. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. గబ్బర్ సింగ్ చిత్రం ఎప్పటికీ పవన్ అభిమానులకు గుర్తుండిపోతుంది. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది.
పవన్ పుట్టిన రోజున..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగానే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 2న ఈ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.
గబ్బర్ సింగ్ మూవీని సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ చేస్తోంది అనుశ్రీ ఫిలిమ్స్. దీనిపై పోస్టర్ కూడా వచ్చింది. మొత్తంగా ఈ బ్లాక్‍బస్టర్ చిత్రాన్ని ఫ్యాన్స్ మరోసారి చూడవచ్చు. ఈ చిత్రం రీ-రిలీజ్‍కు హంగామా భారీ స్థాయిలో ఉండడం పక్కా.
డిప్యూటీ సీఎం అయ్యాక..
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టడటంతో పాటు గ్రామీణాభివృద్ది సహా మరిన్ని కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పవర్ స్టార్ చేయాల్సిన సినిమాలకు బ్రేక్ పడింది. మళ్లీ ఆయనను వెండితెరపై చూసేందుకు మరింత సమయం పడుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆలోగానే గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అవుతుండటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. వెండితెరపై మళ్లీ ఈ సూపర్ హిట్ మూవీని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో సెప్టెంబర్ 2న స్పెషల్ షోలకు ఫుల్ డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
గబ్బర్ సింగ్ చిత్రం 2012 మే 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో గబ్బర్ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేశారు పవన్. ఈ చిత్రంలో పవర్ స్టార్ స్వాగ్, యాక్షన్, మేనరిజమ్‍లతో పాటు కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను అలరించాయి. ఈ మూవీలో పవన్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఐకానిక్‍గా నిలిచిపోయాయి. తన ఎనర్జీతో పవన్ అదరగొట్టేశారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ ఫుల్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఈ మూవీని తెరకెక్కించారు. హిందీ మూవీ దబాంగ్‍కు రీమేక్‍గా కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు.
గబ్బర్ సింగ్ చిత్రానికి అప్పట్లోనే సుమారు రూ.150కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బంపర్ హిట్‍గా ఈ మూవీ నిలిచింది. పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గబ్బర్ సింగ్ మూవీకి దేవీ శ్రీప్రసాద్ పాటలు కూడా పెద్ద బలంగా నిలిచాయి.
కాగా, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను ఆయన చేయాల్సి ఉంది. అయితే, మూడు నెలలు పూర్తిగా తన మంత్రిత్వ శాఖల బాధ్యతల తర్వాత వీలైనప్పుడు షూటింగ్‍లను చేస్తానని పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పారు. ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అంగీకరించిన సినిమాల వరకు పూర్తి చేస్తానని అన్నారు. ఆయన లైనప్‍లోని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి హరీష్ శంకరే డైరెక్టర్.