OTT Telugu Movies This Week: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు ఇవే-gaami to premalu telugu movies to release on otts in this week zee5 aha etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies This Week: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు ఇవే

OTT Telugu Movies This Week: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 07, 2024 07:00 AM IST

OTT Telugu Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి మరిన్ని తెలుగు చిత్రాలు రానున్నాయి. గామి సినిమా కూడా ఇదే వారం స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆ వివరాలివే..

OTT Telugu Movies This Week: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు ఇవే
OTT Telugu Movies This Week: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు ఇవే

OTT Telugu Movies This Week: ఓటీటీల్లోకి కొత్తకొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు క్రమంగా సినిమాలు, వెబ్ సిరీస్‍లు తీసుకొస్తున్నాయి. ఈ ఏప్రిల్ రెండో వారంలోనూ తెలుగులో కొన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఇందులో విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి ముఖ్యమైనదిగా ఉంది. ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకి వస్తోంది. సూపర్ హిట్ ప్రేమలు కూడా రానుంది. ఈ వారం ఓటీటీలో తెలుగులో అడుగుపెట్టనున్న సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

గామి

యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈవారంలోనే ఏప్రిల్ 12వ తేదీన గామి చిత్రం ‘జీ5’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ వెర్షన్‍లలోనూ ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. గామి స్ట్రీమింగ్‍పై జీ5 అధికారిక ప్రకటన కూడా చేసింది.

విశ్వక్‍సేన్ అఘోరగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గామి చిత్రం మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీకి మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ చిత్రాన్ని మార్చి 12వ తేదీ నుంచి జీ5లో చూడొచ్చు.

శర్మ అండ్ అంబానీ

శర్మ అండ్ అంబానీ సినిమా ఏప్రిల్ 11వ తేదీన నేరుగా ‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు. శర్మ & అంబానీ మూవీని ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ ఇప్పటికే అఫీషియల్‍గా వెల్లడించింది.

ప్రేమలు

మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍‍కు రెడీ అయింది. ఈ లవ్ రొమాటింక్ కామెడీ సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు, మలయాళం, హిందీ, తమిళం భాషల్లో ఏప్రిల్ 12వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో తెలుగులో ఆహాలో ఏప్రిల్ 12నే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

గిరీశ్ ఏడీ దర్శకత్వంలో నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమలు సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజై ఆశ్చర్యకరమైన కలెక్షన్లు దక్కించుకుంది. తెలుగులో మార్చి 8న రిలీజై దుమ్మురేపింది. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ.135కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీని ఏప్రిల్ 12 నుంచి ఓటీటీలో వీక్షించవచ్చు.

భీమా

మ్యాచ్ స్టార్ గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‍గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ భీమా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గత వారమే ఈ మూవీ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుందని రూమర్స్ వచ్చినా అలా జరగలేదు. అయితే, ఏప్రిల్ 12వ తేదీన భీమా చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుందని మళ్లీ బజ్ నడుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక, ఏ.హర్ష దర్శకత్వం వహించిన భీమా మూవీ మార్చి 8న రిలీజై అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఏప్రిల్ 12న ఈ మూవీ హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి.

IPL_Entry_Point