Hi Nanna Gaaju Bomma Song Lyrics: మనసుకు హత్తుకునే హాయ్ నాన్నలోని గాజు బొమ్మ సాంగ్ లిరిక్స్ ఇవే
Hi Nanna Gaaju Bomma Song Lyrics: నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న మూవీలోని మనసుకు హత్తుకునే పాట గాజు బొమ్మ సాంగ్ లిరిక్స్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.
Hi Nanna Gaaju Bomma Song Lyrics: హాయ్ నాన్న మూవీలోని గాజు బొమ్మ సాంగ్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. మనసుకు హత్తుకునే ఈ మెలోడియస్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.
హాయ్ నాన్న మూవీలోని ఈ గాజు బొమ్మ పాటను ఖుషీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేశాడు. పాటను కూడా అతడే పాడాడు. ఇక ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. ఈ మెలోడీ సాంగ్ ఎంతో వినసొంపుగా, హాయిగా సాగిపోయింది. హాయ్ నాన్న సినిమా స్టోరీ మొత్తాన్ని ఈ ఒక్క పాటలో ఎంతో హృద్యంగా చెప్పాడు రచయిత అనంత శ్రీరామ్. ఈ పాట లిరిక్స్ మీకోసం..
గాజు బొమ్మ పాట లిరిక్స్ ఇవే..
ఇటు రావె నా గాజు బొమ్మా
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాల కొమ్మా
నిను ఊపే చెయ్యే ప్రేమా
వాలిపో ఈ గుండెపైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా
చిన్ని చిన్ని పాదాలని
నేలై నేను మోయనా
చిందే క్షణంలో నువ్వు కింద పడినా
ఉంటావు నా నీడలా
నీ చెంతే రెండు చెవులుంచి
బయలెల్లనా
యే మాటా నీ నోట వెనువించినా
వింటానే
రానా నిమిషం లోనా
నేనన్నే వదిలేసైనా
తుళ్లే తుళ్లే నీ శ్వాసకే
కాపై నేనుండనా..
ఉచ్వాసనైనా నిశ్వాసనైనా
మేలించి పంపించనా
ఏకాంతులైనా అవి నన్ను దాటాక నే
ఆ రోజు చేరాలి నీ చూపునే
నీ రెప్ప పై ఉంటానే
పాపా కంటి పాపా
నా పాపా కంటి పాపా...
ఇటు రావె నా గాజు బొమ్మా
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాల కొమ్మా
నిను ఊపే చెయ్యే ప్రేమా..
వాలిపో ఈ గుండెపైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా