OTT Hollywood Movie: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే!-furiosa a mad max saga now streaming on jiocinema ott in telugu language ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Hollywood Movie: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే!

OTT Hollywood Movie: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 23, 2024 09:07 AM IST

Furiosa: A Mad Max Saga: చాలా రోజులుగా నిరీక్షిస్తున్న ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ హాలీవుడ్ యాక్షన్ చిత్రం ఏ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టిందంటే..

OTT Hollywood Movie: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే!
OTT Hollywood Movie: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే!

జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇటీవలి కాలంలో పాపులర్ హాలీవుడ్ సినిమాలను వరుసగా తీసుకొస్తోంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు సహా మరిన్ని భారతీయ బాషల్లోనూ అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే మరో హాలీవుడ్ సినిమా జియోసినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

స్ట్రీమింగ్ షురూ

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా సినిమా నేడే (అక్టోబర్ 23) జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మొత్తంగా ఏడు భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‍లో రూపొందిన ఈ హాలీవుడ్ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ జియోసినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. జియోసినిమా ప్రీమియమ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లు రెంట్ లేకుండానే ఈ చిత్రాన్ని చూడొచ్చు. ప్రస్తుతం జియో సినిమా ప్రీమియం నెల ప్లాన్ ధర రూ.29గా ఉంది.

ఐదు నెలల తర్వాత..

క్రిస్ హేమ్స్‌వర్త్ అన్య టేలర్ జాయ్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ మూవీ ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ చిత్రం ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఇండియాలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని చాలా ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన సుమారు ఐదు నెలల తర్వాత ఈ చిత్రం ఇండియాలో జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఏడు భాషల్లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. 168 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సుమారు 170 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. మ్యాడ్‍మ్యాక్స్ ఫ్రాంచైజీలో ఐదో మూవీగా ఫుల్ క్రేజ్ మధ్య రిలీజైన ఈ చిత్రం అందుకు తగ్గట్టు భారీగా వసూళ్లను రాబట్టలేకపోయింది. మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది.

ఈ వారమే ‘మిరండా బ్రదర్స్’

మిరండా బ్రదర్స్ సినిమా జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 25న తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే ఈ చిత్రం అడుగుపెడుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి సంజయ్ గుప్తా దర్శకత్వం వహించగా.. హర్షవర్దన్ రాణే, మీజాన్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.

Whats_app_banner