Friendship Day 2024: ట్రెండ్ మారినా...ఫ్రెండ్ మారడే -స్నేహబంధం గొప్పతనాన్ని చాటిచెప్పే బెస్ట్ తెలుగు సాంగ్స్ ఏవంటే!
Friendship Day 2024: స్నేహబంధంలోని మాధుర్యాన్ని చాటిచెబుతూ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ బెస్ట్ సాంగ్స్ ఏవంటే?
Friendship Day 2024: ఫ్రెండ్‌షిఫ్...అన్నది సినిమాల్లో ఓ సక్సెస్ ఫార్ములా. స్నేహబంధం గొప్పతనాన్ని తెలియజేస్తూ తెలుగులో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. స్నేహబంధం విలువను, ఔన్నత్యాన్ని సినీ కవులు పాటల రూపంలో మధురంగా చాటిచెప్పారు. ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా తెలుగులో స్నేహబంధం నేపథ్యంలో వచ్చిన బెస్ట్ సాంగ్స్ పై ఓ లుక్కేయండి...
ప్రేమ దేశం - ముస్తాఫా ముస్తాఫా
ఫ్రెండ్‌షిప్ డే అనగానే అందరికి తొలుత గుర్తొచ్చే పాట ప్రేమదేశంలోని ముస్తాఫా ముస్తాఫా. ఈ పాటలో వాడిపోనిది స్నేహమొక్కటే...వీడిపోదిని నీడ ఒక్కటే అంటూ ఫ్రెండ్‌షిఫ్ గురించి గొప్పగా వర్ణించారు గేయరచయిత భువనచంద్ర. 1996లో రిలీజైన ఈ మూవీలో అబ్బాస్, వినీత్ హీరోలుగా నటించారు.
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే...
రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీలో ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే పాట స్నేహమాధుర్యాన్ని చక్కగా చాటిచెప్పింది. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే...ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్‌షిప్పే...గుండలోన సౌండ్ పేరు ఫ్రెండ్‌షిప్పే అని లిరిక్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ పాటను చంద్రబోస్ రాశాడు.
దోస్తీ...ఆర్ఆర్ఆర్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని దోస్తీ పాట తో స్నేహబంధంలో తారతమ్యాలకు చోటు ఉండదని చూపించారు రాజమౌళి. బడబాగ్నికి జడివానకు దోస్తీ...విధిరాతకు ఎదురీదని దోస్తీ అంటూ చంద్రబోస్ లిరిక్స్ ఆకట్టుకుంటాయి.
స్నేహమే తోడు...
ఎన్ని ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదురైన మన వెంట స్నేహితుడు మాత్రం తోడుగా ఉండాలని హ్యాపీడేస్‌లోని ఓ మై ఫ్రెండ్‌లో చక్కగా చెప్పారు రైటర్.
ఇద్దరి లోకం ఒకటే...
పెళ్లి పందిని మూవీలోని నేస్తమా ఇద్దరి లోకం పాట ఫ్రెండ్‌షిఫ్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
టాపిక్