Friday Releases: ఒకే రోజు థియేటర్లలోకి వచ్చేస్తున్న ఐదు సినిమాలు.. చిన్నవే కానీ..
Friday Releases: ఈ వారం ఒకే రోజు ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా వాటి కంటెంట్ తో ఆసక్తి రేపుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేయండి.
Friday Releases: ఈ సమ్మర్ అంతా డల్లుగా గడిచిపోయింది. థియేటర్లలోకి పెద్దగా తెలుగు సినిమాలు ఏవీ రాలేదు. ఇప్పుడు మే నెల చివరి రోజు మాత్రం మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి కూడా పెద్ద సినిమాలేమీ కాకపోయినా.. వాటి ట్రైలర్లు చూస్తుంటే ఆసక్తి రేపేలా ఉన్నాయి.
మరో రెండు తమిళ సినిమాలు కూడా ఈ శుక్రవారమే (మే 31) రిలీజ్ కానున్నాయి. ఓటీటీల్లో అయితే ఇప్పటికే ఈ వారం కొన్ని రిలీజ్ అయిపోగా.. మరికొన్ని శుక్రవారం వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం తెలుగు సినిమాల జాతర ఉండనుంది. మరి థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆ సినిమాలేంటో చూసేయండి.
శుక్రవారం థియేటర్ రిలీజెస్
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
గామి మూవీ తర్వాత విశ్వక్సేన్ నటించిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చాలా వాయిదాల తర్వాత మొత్తానికి ఈ సినిమా శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశ్వక్.. లంకల రత్న అనే పాత్రలో నటిస్తున్నాడు. నేహా శెట్టి, అంజలి ఫిమేల్ లీడ్స్ గా ఉన్నారు. మనుషులు మూడు రకాలు.. ఆడాళ్లు.. మగాళ్లు.. రాజకీయ నాయకులు అంటూ ఆసక్తి రేపేలా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
గం గం గణేశా
ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా మూవీ కూడా శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఉదయ్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రగతి శ్రీవాస్తవ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ క్రైమ్ కామెడీ మూవీ ఓ గణేషుడి విగ్రహం చోరీ చుట్టూ తిరగనుంది. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ కూడా బాగుంది. ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రష్మికను పిలిచి ఆమె కోస్టార్ ఎవరో చెప్పించి మరింత మందిని మేకర్స్ ఆకర్షించారు.
గరుడన్ (తమిళం)
గరుడన్ అనే ఓ తమిళ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. దురై సెంథిల్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదల పార్ట్ 1లో తన నటన ద్వారా ఆకట్టుకున్న సూరి ఈ మూవీలో లీడ్ రోల్ పోషించాడు.
భజే వాయు వేగం
కార్తికేయ నటించిన మూవీ భజే వాయు వేగం. ఈ సినిమా కూడా శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్ కూడా నటించింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కనిపిస్తోంది.
హిట్ లిస్ట్ అనే మరో తమిళ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. సూర్య కాతిర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ కనిష్క, గౌతమ్ మేనన్ లాంటి వాళ్లు నటించారు. ఇవే కాకుండా కాజల్ సత్యభామ, సుధీర్ బాబు హరోంహర సినిమాలు కూడా మే 31నే రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఇవి రెండూ వాయిదా పడ్డాయి. సత్యభామ జూన్ 7న, హరోంహర జూన్ 14న రిలీజ్ కానున్నాయి.