Four More Shots Please season 3 Web Series Review: ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్ సీజ‌న్ 3 వెబ్‌సిరీస్‌ రివ్యూ-four more shots please season 3 web series review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Four More Shots Please Season 3 Web Series Review

Four More Shots Please season 3 Web Series Review: ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్ సీజ‌న్ 3 వెబ్‌సిరీస్‌ రివ్యూ

Nelki Naresh Kumar HT Telugu
Oct 29, 2022 06:20 AM IST

Four More Shots Please season 3 Web Series Review: ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. న‌లుగురు అమ్మాయిల క‌థ‌తో ఈ సిరీస్ తెర‌కెక్కింది. ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్ కొత్త సీజన్‌ రిలీజనగానే ఆ జానర్‌ ఆడియెన్స్‌ లో మంచి ఇంట్రెస్ట్ క్రియేటయింది.

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజ‌న్ 3
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజ‌న్ 3

Four More Shots Please season 3 Web Series Review: ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్‌.. ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వన్ ఆఫ్‌ ది టాప్ సిరీస్‌.ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ నుంచి తాజాగా మూడో సీజన్‌ కూడా రిలీజైంది.కీర్తి కుల్హ‌రి, మాన్వీ గాగ్రూ, స‌యానీ గుప్తా, బాని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూడో సీజ‌న్‌కు జోయిటా ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

బోల్ట్ కంటెంటెట్‌తో తెర‌కెక్కిన ఇలాంటి సిరీసులతో సొసైటీ ఎఫెక్టయ్యే చాన్స్‌ ఉందన్న విమర్శలు కూడా వ‌చ్చాయి. కానీ ఓటీటీ కంటెంట్ కాబట్టి నచ్చే ఆడియెన్స్‌ చూడడంతో వన్ ఆఫ్‌ ది టాప్‌ సిరిస్‌ గా పేరు తెచ్చుకుంది.ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన ఈ సిరీస్ ఎలా ఉందంటే...

ఇండిపెండెంట్ గ‌ర్ల్స్ క‌థ‌

ఉమాంగ్ (బాని), దామిని (స‌యానీ గుప్తా), అంజ‌నా (కీర్తి కుల్హ‌రి), సిద్ధి (మాన్వీ గాగ్రూ) న‌లుగురు ఆధునిక భావ‌జాలం క‌లిగిన ఇండిపెండెంట్ అమ్మాయిలు. త‌మ జీవితంలో ఎదురైన స‌మ‌స్య‌ల‌ను వారు ఎలా అధిగ‌మించారు? వారు తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మాజంతో పాటు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ అంగీక‌రించారా? చివ‌ర‌కు ఆ న‌లుగురు అమ్మాయిల జీవితాలు ఎలా ముగిసాయ‌న్న‌దే ఈ సిరీస్ క‌థ‌.

ఇంటిమేట్ సీన్స్‌...

ఫోర్ మోర్ షాట్స్ సీజ‌న్ 2కు కొన‌సాగింపుగా సీజ‌న్ 3 సాగుతుంది. ఉమంగ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం, సిద్ధి వాళ్ల నాన్న చనిపోవడం, అంజనా రిలేషన్‌ షిప్‌ బయటపడడం, దామిని మిస్‌ క్యారేజ్‌..ఇలా ఒక్కో పాత్రకి ఒక్కో కాన్ ఫ్లిక్ట్ తో సీజ‌న్ 2ను ఎండ్ చేయడం వల్ల థర్డ్ సీజన్‌ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేశారు. కానీ ఎగ్జైట్‌మెంట్ నీరుగారిపోవ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు.

ఆడియెన్స్‌ పెద్దగా ఫీలవ్వని ఇంటెన్సిటీతో ఒక్కో క్యారెక్టర్‌ కీ ఒక్కో కాన్ ఫ్లిక్ట్ వాటికో అర్థం లేని ఎండింగ్ ఇచ్చి మూడో సీజ‌న్‌ను ముగించేశారు. ఈ సీజ‌న్‌లో మెయిన్ క్యారెక్టర్లయిన ఉమంగ్, అంజనా, సిద్ధి, దామిని ఈ నాలుగు పాత్రలు కొన్ని సార్లు పరిధిని దాటి ప్రవర్తిస్తున్నటు అనిపిస్తుంటాయి.చాలా చోట్ల లవ్ మేకింగ్ సీన్స్‌, ఇంటిమేట్ సీన్స్‌ కావాలని క్రియేట్‌ చేసినట్లు ఉంటాయి.

ఫారిన్ ట్రిప్‌...

ఫ‌స్ట్ అండ్ సెకండ్ సీజ‌న్‌ల‌లో చాలా సీన్స్ ముంబాయి, ట్రక్‌ బార్, అపార్ట్ మెంట్స్‌ లోనే క‌నిపిస్తాయి. ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్‌ మూడో సీజ‌న్‌కు కొత్త లుక్‌ తెద్దామని ఓ ఎపిసోడ్ పంజాబ్‌ లో, మ‌రో ఎపిసోడ్ బర్త్‌ డే ట్రిప్‌ పేరుమీద ఫారిన్‌ లో చుట్టేశారు. కానీ అవేవీ ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయ‌లేక‌పోయాయి.

క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే…

నిజానికి ఈ సీజన్‌ కూడా అందరికీ యూనివర్సల్ గా కనెక్టయ్యే కాన్సెప్ట్ కాదు. మొదటి రెండు సీజన్లను ఆ సెట్ ఆఫ్‌ ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యారు. ఫెమినిజం, ఇండివిడ్యువాలిటీ, మోడర్న్‌ రిలేషన్‌షిప్స్‌, పేజ్‌ త్రీ లుకింగ్స్ తో నాలుగు మెయిన్ క్యారెక్ట‌ర్స్‌ డిఫ‌రెంట్ కాన్‌ ఫ్లిక్ల్ న్ డీల్ చేస్తూ మూడో సీజ‌న్‌ను న‌డిపించారు. కొన్ని చోట్ల కీర్తి కుల్హ‌రి, స‌యానీ గుప్తా, బానీ, మాన్వీ గ‌గ్రూ యాక్టింగ్‌, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి.

సాగ‌తీత ఎక్కువే...

ఫస్ట్‌ సీజన్‌ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండడంతో ఆడియెన్స్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ ని దక్కించుకుందీ సిరీస్‌. సెకండ్‌లో సీజ‌న్‌లో ఆ థ్రిల్ కొంత‌వ‌ర‌కు మిస్స‌యింది. ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్‌ థ‌ర్డ్ సీజ‌న్ పూర్తిగా సాగ‌తీత‌ధోర‌ణిలో ముందుకు సాగుతుంది.సీజన్‌ను లా..గుతున్నాం అని క్లారిటీ వచ్చిందో ఏమో గానీ మొత్తానికి అందరికీ అడ్డా అయిన ట్రక్‌ బార్‌ని కూల్చేసి మరీ ఎండ్ చేశారు. మొదటి రెండు సీజన్స్‌ చేశాక ఏ పాత్ర ఎలాంటి మలుపు తీసుకుంటుందో అని తెలీడానికి థర్డ్ సీజన్‌ ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్: 2.5/5

IPL_Entry_Point