జాక్వెలిన్ తో శిఖర్ ధావన్ చిందులు.. ట్రెండీ బీట్.. హాట్ మూవ్స్.. వైరలవుతోన్న వీడియో ఆల్బమ్-former indian cricketer steps with hot beauty jacqueline fernandez in besos video album shreya ghoshal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  జాక్వెలిన్ తో శిఖర్ ధావన్ చిందులు.. ట్రెండీ బీట్.. హాట్ మూవ్స్.. వైరలవుతోన్న వీడియో ఆల్బమ్

జాక్వెలిన్ తో శిఖర్ ధావన్ చిందులు.. ట్రెండీ బీట్.. హాట్ మూవ్స్.. వైరలవుతోన్న వీడియో ఆల్బమ్

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్టెప్పులేశాడు. ఓ వీడియో ఆల్బమ్ లో ఈ జోడీ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడీ సాంగ్ తెగ వైరలవుతోంది.

జాక్వెలిన్ తో ధావన్ చిందులు (youtube)

గ్రౌండ్ లో బ్యాట్ తో సిక్సర్లు, ఫోర్లు బాదిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి స్టెప్పులు కుమ్మేశాడు. ఈ పెయిర్ కలిసి ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ లో అదరగొట్టారు. ‘బెసోస్’ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో క్రమంగా ట్రెండ్ అవుతోంది.

అందాల విందు

‘బెసోస్’ వీడియో సాంగ్ గురువారం (మే 8) యూట్యూబ్ లో రిలీజైంది. ఇందులో బాలీవుడ్ హాట్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మూవ్స్ తో కుర్రకారును రెచ్చగొడుతోంది. తన సిజ్లింగ్ డ్యాన్స్ తో అందాల విందు వడ్డించింది ఈ భామ. గ్లామర్ ట్రీట్ తో సమ్మర్ హీట్ మరింత పెంచేసింది. ఆమె హాట్ డ్యాన్స్ మూవ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

శిఖర్ స్వాగ్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ వీడియో సాంగ్ లో అదరగొట్టాడు. తన స్వాగ్ వేరే లెవల్లో ఉంది. అంతే కాకుండా జాక్వెలిన్ తో కలిసి స్టెప్పులు వేశాడు ధావన్. ధావన్ కు డ్యాన్స్ కొత్తేమీ కాదు. గతంలో సహచర ప్లేయర్లతో కలిసి అతను స్టెప్పులేసిన రీల్స్ తెగ వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్ లోనూ స్వాగ్ తో దుమ్మురేపాడు ధావన్.

ట్రెండీ బీట్

రజత్ నాగ్ పాల్, ఫ్రీబాట్, కార్ల్ వైన్ మ్యూజిక్ అందించిన ‘బెసోస్’ ఆల్బమ్ ట్రెండీ బీట్ తో సాగుతోంది. ఈ పాటకు లిరిక్స్ కూడా వీళ్లే రాశారు. కుర్రాళ్లతో స్టెప్పులు వేయించేలా ఈ బీట్ ఉంది. ఇక ఈ సాంగ్ ను శ్రేయా ఘోషల్ తన సింగింగ్ తో మరో లెవల్ కు తీసుకెళ్లారు. శ్రేయా ఘోషల్, కార్ల్ వైన్ ఈ పాటను పాడారు.

ప్లే డీఎంఎఫ్ ఛానెల్ లో రిలీజ్ చేసిన ఈ పాటకు మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ జాన్ క్లేస్, రజత్ నాగ్ పాల్. దీన్ని పియూష్, షాజియా డైరెక్ట్ చేశారు. పియూష్, షాజియానే అదిరిపోయే స్టెప్స్ కూడా కంపోజ్ చేశారు. ప్రస్తుతం హౌస్ ఫుల్ 5 రిలీజ్ సందడిలో ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ వీడియోతో మరింత గా వైరల్ అవుతోంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధావన్ ఈ వీడియోతో ఆకట్టుకున్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం