Heroines Sisters: అక్కలాగే సినిమాల్లోకి వచ్చి ప్లాప్ అయిన హీరోయిన్స్.. కాజల్ అగర్వాల్ నుంచి ప్రియాంక చోప్రా చెల్లి వరకు!-flop heroines who entered like their sisters in film industry like shamita shetty nisha aggarwal parineeti chopra radha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroines Sisters: అక్కలాగే సినిమాల్లోకి వచ్చి ప్లాప్ అయిన హీరోయిన్స్.. కాజల్ అగర్వాల్ నుంచి ప్రియాంక చోప్రా చెల్లి వరకు!

Heroines Sisters: అక్కలాగే సినిమాల్లోకి వచ్చి ప్లాప్ అయిన హీరోయిన్స్.. కాజల్ అగర్వాల్ నుంచి ప్రియాంక చోప్రా చెల్లి వరకు!

Sanjiv Kumar HT Telugu

Flop Actress Who Are Sisters Of Heroines: సినిమాల్లోకి తమ అక్కలాగే ఎంతోమంది హీరోయిన్స్ చెల్లెల్లు కథనాయికలుగా వచ్చారు. కానీ, అక్కలాగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. అలాంటి ప్లాప్ హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. వారిలో కాజల్ అగర్వాల్ నుంచి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చెల్లి వరకు ఉన్నారు.

అక్కలాగే సినిమాల్లోకి వచ్చి ప్లాప్ అయిన హీరోయిన్స్.. కాజల్ అగర్వాల్ నుంచి ప్రియాంక చోప్రా చెల్లి వరకు!

Flop Heroines Who Are Sisters Of Star Actress: సినీ ఇండస్ట్రీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఫేమ్, క్రేజ్ ఇస్తుందో చెప్పలేం. అయితే, తమ అక్కలాగే సినిమాల్లోకి హీరోయిన్స్‌గా వచ్చిన సిస్టర్స్ కథనాయికలు ఎంతోమంది ఉన్నారు. కానీ, తమ అక్కలాగే స్టార్ హీరోయిన్ రేంజ్‌ను మాత్రం అందుకోలేకపోయారు. అలా సక్సెస్ కానీ ఫ్లాప్ అయిన హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

శిల్పా శెట్టి-షమితా శెట్టి

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి. తెలుగులో కూడా పలు సినిమాలు చేసి అలరించింది. వెంకటేష్‌తో సాహసవీరుడు సాగరకన్య, మోహన్ బాబుతో వీడెవండీ బాబు వంటి సినిమాల్లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది శిల్పా శెట్టి.

ఇక శిల్పా శెట్టి చెల్లెలుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బ్యూటిఫుల్ షమితా శెట్టి. అయితే, ఎన్నో హిందీ చిత్రాల్లో యాక్ట్ చేసిన షమితా శెట్టి తన అక్క శిల్పా శెట్టిలాగా క్రేజీ హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. మొహబ్బీతీన్, జహీర్, ది టెనంట్, ఫరెబ్, క్యాష్, బేవఫా వంటి 20 వరకు సినిమాల్లో నటించింది షమితా శెట్టి.

రాధ-అంబిక

అలనాటి స్టార్ హీరోయిన్ రాధకు ఉన్న క్రేజ్ వేరు, 90స్ కాలంలో అగ్ర కథనాయికగా ఒక వెలుగ వెలిగారు రాధ. స్టార్ హీరోలతో జతకట్టి పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. అలా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన రాధకు చెల్లెలిగా అంబిక కూడా కథనాయికగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, రాధ అంతలా తెలుగులో సక్సెస్ కాలేకపోయారు. అయితే, కన్నడలో మాత్రం అంబిక మంచి పేరు తెచ్చుకున్నారు.

జయసుధ-సుభాషిణి

అలనాటి స్టార్ హీరోయిన్లలో జయసుధ ఒకరు. సహజమైన నటనతో ఎనలేని పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ అనంతరం కూడా నటిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే, ఆమె సోదరిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుభాషిణి జయసుధల రాణించలేకపోయారు. కానీ, అరుంధతి సినిమాలో పశుపతి తల్లిగా సుభాషిణి మెప్పించారు.

ప్రియాంక చోప్రా-పరిణీతి చోప్రా

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోందని టాక్ వస్తున్న విషయం తెలిసిందే. సౌత్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో స్టార్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్‌కు సైతం వెళ్లి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది.

అలాంటి ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్‌గా సినీ రంగప్రవేశం చేసిన ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. ఇషాక్‌జాదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా పలు హిట్ సినిమాలతో బాగానే అలరించింది. కానీ, ప్రియాంక చోప్రా అంతలా మాత్రం ఇంకా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది.

కాజల్ అగర్వాల్-నిషా అగర్వాల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్‌గా ఎంతోమంది అగ్ర హీరోలతో జత కట్టి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ చెల్లెలిగా నిషా అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. పలు హిట్ సినిమాలు చేసినప్పటికీ కాజల్ అగర్వాల్ అంతలా ఫేమస్ కాలేకపోయింది బ్యూటిఫుల్ నిషా అగర్వాల్.

మరికొంతమంది

వీరిలాగే ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా తెచ్చుకున్నంతలా ఆమె చెల్లెలు నిధి అగర్వాల్ (గంగ్రోతి ఫేమ్) పాపులర్ కాలేకపోయింది. స్టార్ హీరోయిన్, సలార్ బ్యూటీ శ్రుతి హాసన్ లా ఆమె సోదరి అక్షర హాసన్ కూడా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌లాగా ఆమె చెల్లెలు తనీషా ముఖర్జీ సక్సెస్ కాలేకపోయింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం