OTT Telugu: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు సినిమాలు.. ఏ మూవీ, ఏ ప్లాట్‍ఫామ్‍లో..-five movies in telugu ott releases this week pani to ram nagar banny streaming netflix aha sonyliv latest films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు సినిమాలు.. ఏ మూవీ, ఏ ప్లాట్‍ఫామ్‍లో..

OTT Telugu: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు సినిమాలు.. ఏ మూవీ, ఏ ప్లాట్‍ఫామ్‍లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 18, 2025 02:13 PM IST

OTT Telugu Latest Movies: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో ఐదు చిత్రాలు వచ్చాయి. అందులో రెండు స్ట్రైట్ తెలుగు చిత్రాలు కాగా.. మూడు డబ్బింగ్‍లో అడుగుపెట్టాయి. ఆ సినిమాలు ఏవి.. ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.

OTT Telugu: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు సినిమాలు.. ఏ మూవీ, ఏ ప్లాట్‍ఫామ్‍లో..
OTT Telugu: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు సినిమాలు.. ఏ మూవీ, ఏ ప్లాట్‍ఫామ్‍లో..

ఓటీటీల్లో తెలుగులో కొత్తగా వచ్చిన సినిమాలు ఏవో వెతుకుతున్నారా.. ఈ వారం వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో తెలుగులో ఐదు చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. సంక్రాంతి పండుగ వచ్చిన ఈ జనవరి మూడో వారంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. ఇందులో రెండు తెలుగు స్ట్రైట్ చిత్రాలు ఉన్నాయి. ఒకటి నేరుగా ఓటీటీలోకే వచ్చింది. ఇక ఐదింట్లో మూడు తెలుగు డబ్బింగ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అలా ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో అందుబాటులోకి వచ్చిన ఐదు సినిమాలు ఏవంటే..

రామ్‍నగర్ బన్నీ

రామ్‍నగర్ బన్నీ సినిమా ఈ శుక్రవారం (జనవరి 17) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన చంద్రహాస్ హీరోగా నటించారు. బుల్లితెర మెగాస్టార్‌గా పిలిచే ప్రభాకర్ కుమారుడే ఇతడు. అక్టోబర్ 4వ తేదీన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీగా రిలీజ్ కాగా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని పెద్దగా ఆడలేదు. ఈ చిత్రానికి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. రామ్‍నగర్ బన్నీ చిత్రం థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

మోక్షపటం

మోక్షపటం చిత్రం ఆహా ఓటీటీలోకి జనవరి 14వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో విడుదల కాకుండా ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీలో తిరువీర్, తరుణ్ పొనుగోటి, పూజా కిరణ్, శాంతి రావ్, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్ లీడ్ రోల్స్ చేశారు. మోక్షపటం మూవీని డైరెక్టర్ రాహుల్ వనజ రామేశ్వర్ తెరకెక్కించారు.

పని

మలయాళ సీనియర్ యాక్టర్ జోజూ జార్జ్ ప్రధాన పాత్ర పోషించి.. దర్శకత్వం వహించిన పని చిత్రం ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా జనవరి 15వ తేదీ సాయంత్రమే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది అక్టోబర్ 24నే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి హిట్ సాధించింది.

మిన్‍మినీ

తమిళ మూవీ ‘మిన్‍మినీ’ తెలుగు వెర్షన్ ఈవారంలోనే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. గతేడాది ఆగస్టు 9న ఈ చిత్రం తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి తెచ్చింది. మిన్‍మినీ చిత్రంలో గౌరవ్ కాలయ్, ప్రవీణ్ కిశోర్, ఎస్తర్ అనిల్ లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి హలిత షమీమ్ దర్శకత్వం వహించారు.

రైఫిల్ క్లబ్

రైఫిల్ క్లబ్ సినిమా ఈ వారంలోనే జనవరి 16వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ మలయాళం చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. దిలీశ్ పోతన్, విజయరాఘవన్, అనురాగ్ కశ్యప్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం గత డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. రైఫిల్ క్లబ్ మూవీకి అషిక్ అబూ డైరెక్షన్ చేశారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం