India first tv serial: ఇండియాలో వచ్చిన తొలి టీవీ సీరియల్ ఇదే.. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు
first tv serial in india: ఇండియాలో వచ్చిన తొలి టీవీ సీరియల్ ఏదో తెలుసా? 40 ఏళ్ల కిందట వచ్చిన ఈ సీరియల్ అప్పట్లో క్రియేట్ చేసిన వ్యూయర్షిప్ రికార్డును ఇప్పటి వరకూ కేవలం రెండు సీరియల్స్ మాత్రమే అధిగమించాయి.
first tv serial in india: ప్రస్తుతం ఇండియాలో వందల కొద్దీ టీవీ ఛానెల్స్ వేల సంఖ్యలో సీరియల్స్, షోస్ వస్తున్నాయి. కానీ నాలుగు దశాబ్దాల కిందట పరిస్థితి వేరు. అప్పుడు ఉన్నది కేవలం దూరదర్శన్ మాత్రమే. శాటిలైట్ ఛానెల్స్ రాక ముందు టీవీ సీరియల్స్ అన్నది చాలా అరుదైన విషయం. మరి మన దేశంలో వచ్చిన తొలి టీవీ సీరియల్ ఏదో తెలుసా?
ఇండియాలో తొలి టీవీ సీరియల్ ఇదే..
ఇండియాలో 40 ఏళ్ల కిందట టీవీలు ఉన్న ఇళ్లే చాలా తక్కువ. ఆ ఇళ్లలోనూ వచ్చేది కేవలం దూరదర్శన్ ఛానెల్ మాత్రమే. దీంతో దేశంలో తొలి టీవీ సీరియల్ వచ్చింది కూడా ఆ ఛానెల్లోనే. 1984లో హమ్ లోగ్ పేరుతో ఈ సీరియల్ ప్రారంభమైంది. సుమారు ఏడాదిన్నరపాటు 157 ఎపిసోడ్లుగా ప్రతి వారం ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యేది.
టీవీ సీరియల్ అంటే తెలియని ఆ రోజుల్లోనే ఈ హమ్ లోగ్ వ్యూయర్షిప్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ 40 ఏళ్లలో ఆ సీరియల్ వ్యూయర్షిప్ రికార్డును బ్రేక్ చేసిన ఘనత కేవలం మరో రెండు సీరియల్స్ కు మాత్రమే దక్కింది. ఈ లెక్కక హమ్ లోగ్ సీరియల్ కు ఉన్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.
హమ్ లోగ్ సీరియల్
ఈ హమ్ లోగ్ సీరియల్ ను మనోహర్ శ్యామ్ జోషి క్రియేట్ చేయగా.. కుమార్ వాసుదేవ్ డైరెక్ట్ చేశాడు. వినోద్ నాగ్‌పాల్, జయశ్రీ అరోరా, రాజేష్ పూరి, సీమా పహ్వా, దివ్యా సేఠ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. ఇక ఈ సీరియల్ కు హోస్ట్, యాంకర్ గా స్టార్ హీరో అశోక్ కుమార్ వ్యవహరించడం. అప్పట్లో ప్రతి ఎపిసోడ్ ముగిసిన తర్వాత అతడు వచ్చి ఆ స్టోరీ గురించి చర్చించేవాడు.
ఈ హమ్ లోగ్ టీవీ సీరియల్ పీక్ లో ఉన్నప్పుడు ఏకంగా 5 కోట్ల వ్యూయర్షిప్ సంపాదించడం గమనార్హం. ఆ తర్వాత కొన్ని వందల టీవీ సీరియల్స్ వివిధ భాషల్లో వచ్చినా.. కేవలం రెండు మాత్రమే ఈ రికార్డును బ్రేక్ చేయగలిగాయి. ఆ రెండూ రామానంద సాగర్ క్రియేట్ చేసినవే కావడం విశేషం. అందులో ఒకటి రామాయణం సీరియల్.
ఈ సీరియల్ ఏకంగా 7.7 కోట్ల వ్యూయర్షిప్ దక్కించుకోగా.. లవ కుశ 6.6 కోట్ల వరకూ వచ్చింది. అయితే మహాభారతం సీరియల్ కు కూడా దేశంలో మంచి క్రేజ్ వచ్చినా.. హమ్ లోగ్ సీరియల్లో సగం కూడా అందుకోలేకపోయింది. మహాభారత్ కు గరిష్ఠంగా 2.2 కోట్ల వ్యూయర్షిప్ నమోదైంది. ఈ రోజుల్లో దేశంలో టాప్ సీరియల్స్ లో ఒకటిగా భావిస్తున్న నాగిన్ కూడా కేవలం కోటి టీఆర్పీ ఇంప్రెషన్స్ నే దక్కించుకుంది.
ఏంటీ హమ్ లోగ్ సీరియల్?
హమ్ లోగ్ సీరియల్ తొలి ఎపిసోడ్ జులై 7, 1984న తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రోజువారీ ఆ కుటుంబం ఎదుర్కొనే సవాళ్లు, సమస్యల ఆధారంగా ఈ సీరియల్ తెరకెక్కింది. ప్రతి ఎపిసోడ్లో ఆ ఫ్యామిలీ ఎదుర్కొనే సమస్యలను చూపించడం, ఎపిసోడ్ చివర్లో అశోక్ కుమార్ వచ్చి వాటిపై చర్చించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ డిసెంబర్ 17, 1985లో ముగిసింది.