మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దమవుతోంది. ‘మాస్ జాతర’ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ ఫిల్మ్ సందడి మొదలైంది. ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ నేడు (ఏప్రిల్ 14) రిలీజైంది. ‘తూ మేరా లవర్’ అంటూ సాగుతున్న ఈ సాంగ్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చనిపోయిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ చక్రి గొంతును ఏఐ సాయంతో రీక్రియేట్ చేసి ఈ పాట పాడించారు.
రవితేజకు దివంగత చక్రి ఎన్నో ఛార్ట్ బస్టర్స్ అందించారు. హిట్ సాంగ్స్ ఇచ్చారు. అలాంటి చక్రికి ట్రిబ్యూట్ గా మాస్ జాతర టీమ్ ఈ స్పెషల్ సాంగ్ ను రెడీ చేసింది. ఏఐ సాయంతో చక్రి గొంతుతో ‘తూ మేరా లవర్’ సాంగ్ ను సిద్ధం చేసింది. ఆయన గొంతులో మళ్లీ పాట వినడం ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. చక్రికి రవితేజ అండ్ టీమ్ గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చిందనే కామెంట్లు వస్తున్నాయి.
రవితేజ హీరోగా నటించిన ఇడియట్ మూవీలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చక్రినే స్వయంగా పాడిన ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలోని రవితేజ హుక్ స్టెప్స్ కూడా ఎంతో ఫేమస్. ఇప్పుడు మాస్ జాతర మూవీలో నుంచి రిలీజైన తూ మేరా లవర్ సాంగ్ లోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాట ట్యూన్ ను వాడారు. రవితేజ కూడా అప్పటి స్టెప్పులనూ మళ్లీ అంతే ఎనర్జీగా, స్టైలిష్ గా వేశారు.
మాస్ జాతర నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘తూ మేరా లవర్’ పెప్పీగా సాగుతోంది. హై ఎనర్జీ బీట్ తో కుర్రాళ్లతో స్టెప్పులు వేయించేలా ఉంది. హీరోయిన్ శ్రీలీలను టీజ్ చేస్తూ రవితేజ వేస్తున్న డ్యాన్స్ ఎనర్జీతో నిండిపోయింది. శ్రీలీల కూడా గ్లామరస్ గా కనిపించింది. ఈ పాట సోర్స్ వోకల్స్ ను భీమ్స్ సిసిరోలియో పాడగా.. దీనికి చక్రి గొంతును ఏఐతో రీక్రియేట్ చేశారు.
మాస్ జాతర మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైెరెక్టర్. ఈ తూ మేరా లవర్ సాంగ్ ను భాస్కరభట్ల రవి కుమార్ రాశారు. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి జంటగా నటిస్తున్న ఈ మూవీకి భాను భోగవరపు డైరెక్టర్. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. జులై మూడో వారంలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
సంబంధిత కథనం