ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా హారర్, క్రైమ్, కామెడీ జోనర్ సినిమాలను ఓటీటీ ఆడియెన్స్ అమితంగా ఇష్టపడుతుంటారు. ఇక క్రైమ్ థ్రిల్లర్స్‌కు బోల్డ్ సీన్స్ యాడ్ చేసి తెరకెక్కిస్తే మరింత ఆదరణ పొందుతుంటాయి.
ఇక ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా కొన్ని సినిమాలు ట్రెండింగ్‌లో, టాప్‌లో దూసుకుపోతుంటాయి. ఇప్పుడు అలా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి చాలా రోజులు అయినప్పటికీ టాప్‌లో సత్తా చాటుతున్న ఓ సినిమా గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఓటీటీ టాప్ మూవీస్‌లో దూసుకుపోతోన్న సినిమా ఫైర్. తమిళంలో బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఫైర్. ఈ సినిమాలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేసే డాక్టర్ తన క్లినిక్‌కు వచ్చిన లేడి పేషంట్స్‌తో సంబంధాలు పెట్టుకుంటాడు.
వారితో అఫైర్స్ పెట్టుకుని శారీరకంగా కలుస్తాడు. శృంగారం జరిగే సమయంలో వీడియోలు తీసి ఆ తర్వాత బెదిరిస్తాడు. నిజ జీవితంలో థెరపిస్ట్ ముసుగులో ఉండి అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసే ఓ డాక్టర్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
అమ్మాయిల శృంగార వీడియోలు తీసిన ఆ డాక్టర్ ఓరోజు కనిపించకుండా పోతాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు డాక్టర్ చాలా మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని తెలుస్తుంది. చివరి వరకు ఆ డాక్టర్ ఏమయ్యాడనే సస్పెన్స్‌తో థ్రిల్లింగ్‌గా ఫైర్ మూవీ సాగుతుంది.
ఇలాంటి ఫైర్ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, టెంట్‌కొట్టాలో పైర్ ఓటీటీ రిలీజ్ అయింది. ముందుగా మార్చి 26న టెంట్‌కొట్టాలో తమిళంలో ఫైర్ స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోయింది.
ఆ తర్వాత సుమారు 14 రోజుల వ్యవధిలో ఏప్రిల్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి ఫైర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. రిలీజ్ అయిన మొదట్లో ప్రైమ్ వీడియో ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 4 ప్లేస్‌లో ట్రెండ్ అయింది. ఆ తర్వాత టాప్ 10 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ టాప్ మూవీస్ జాబితాలో రెండో స్థానంలో ఫైర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రెండో ఓటీటీలోకి వచ్చి 17 రోజులు కావొస్తున్న ఫైర్ టాప్ మూవీస్‌లో స్థానం సంపాదించుకోవడం విశేషంగా మారింది. కేవలం తమిళంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఫైర్ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్