Bold OTT: తమిళ్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫైర్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఈ కోలీవుడ్ మూవీలో బాలాజీ మురుగదాస్ హీరోగా నటించాడు. సాక్షి అగర్వాల్, చాందిని తమిళరాసన్, రచితా మహాలక్ష్మి కీలక పాత్రలు పోషించారు.
బోల్డ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను టెంట్ కోట దక్కించుకున్నది. మార్చి 21 నుంచి ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. టెంట్ కోటతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.ఫైర్ మూవీకి జేఎస్‌కే సతీష్‌కుమార్ దర్శకత్వం వహించాడు. డీకే మ్యూజిక్ అందించాడు.
2020లో నాగర్‌కోయిల్‌లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు ఆధారంగా ఈ మూవీ రూపొందింది. బోల్డ్ అంశాలతో దర్శకుడు సతీష్ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఫైర్ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. మంచి ఓపెనింగ్స్ రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
కాశీ ఫిజియోథెరఫిస్ట్‌గా పనిచేస్తుంటాడు. అనూహ్యంగా ఓ రోజు అతడు అదృశ్యం అవుతాడు. కాశీ మిస్సింగ్‌పై అతడి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ ఆఫీసర్ శరవణన్ ఈ కేసును ఇన్వేస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. అతడి అన్వేషణలో కాశీకి సంబంధించి ఊహించని విషయాలు వెలుగులోకి వస్తాయి. వంద మందికి పైగా అమ్మాయిలపై కాశీ వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. సీక్రెట్‌గా వీడియోలు తీస్తూ వారిని కాశీ బ్లాక్‌మెయిల్ చేశాడని శరవణన్ తెలుసుకుంటాడు. కాశీకి ఆ అమ్మాయిలు ఎలాంటి శిక్ష విధించారు? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
ఫైర్ మూవీలో డైరెక్టర్ సతీష్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ప్రాపర్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు సినిమాకు రూపొందించాడు. కాశీ పాత్ర గురించి ఒక్కో అమ్మాయి...ఒక్కో కథ చెప్పడం...ట్విస్ట్, టర్న్‌లతో ఈ సినిమాను నడిపించి ప్రేక్షకులను మెప్పించాడు.
ఫైర్ మూవీలో హీరోయిన్‌గా నటించిన చాందిని తమిళరాసన్ తెలుగులో కాళీచరణ్, లవర్స్, కిరాక్, బుజ్జి ఇలారాతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ఇటీవల తమిళంలో రిలీజైన పేరుసులో ఓ కీలక పాత్ర పోషించింది.
ఫైర్ మూవీలో హీరోగా నటించిన బాలాజీ మురుగదాస్ తమిళ బిగ్‌బాస్ సీజన్ 4లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ అల్టిమేట్‌లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
సంబంధిత కథనం