Filmfare OTT Awards 2023: ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2023.. బెస్ట్ వెబ్ సిరీస్ ఇదే
Filmfare OTT Awards 2023: ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2023 సెర్మనీ ఆదివారం (నవంబర్ 26) ఘనంగా జరిగింది. ఈ అవార్డుల్లో 2023కిగాను బెస్ట్ వెబ్ సిరీస్ గా స్కూప్ (Scoop) నిలవడం విశేషం.
Filmfare OTT Awards 2023: ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2023లో ఓటీటీల్లోని బెస్ట్ వెబ్ సిరీస్, బెస్ట్ ఒరిజినల్ మూవీస్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులను అందజేశారు. ఈ వేడుక ఆదివారం (నవంబర్ 26) రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఓటీటీల్లో వచ్చిన సిరీస్, సినిమాల్లో నుంచి బెస్ట్ యాక్టర్స్, టెక్నీషియన్స్ లు అవార్డులు అందుకున్నారు.
2023కుగాను బెస్ట్ వెబ్ సిరీస్ గా నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన స్కూప్ (Scoop) ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డు అందుకోవడం విశేషం. 2011లో జరిగిన మిడ్ డే రిపోర్టర్ జ్యోతిర్మయి డే హత్య చుట్టూ తిరిగే కథ ఇది. ఇక బెస్ట్ యాక్టర్ (మేల్) గా రాజ్‌కుమార్ రావ్.. బెస్ట్ యాక్టర్ (ఫిమేల్)గా ఆలియా భట్ నిలిచారు. డార్లింగ్స్ సినిమాకుగాను ఆలియా అవార్డు అందుకోగా.. మోనికా ఓ మై డార్లింగ్ మూవీకిగాను రాజ్‌కుమార్ రావ్ ను అవార్డు వరించింది.
ఇక వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. బెస్ట్ యాక్టర్ (ఫిమేల్)గా స్కూప్ కోసం కరిష్మా తన్నా, దహాద్ కోసం సోనాక్షి సిన్హా నిలిచారు. ఇక బెస్ట్ యాక్టర్ మేల్ కేటగిరీలో దహాద్ వెబ్ సిరీస్ కోసమే విజయ్ వర్మ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ వెబ్ సిరీస్ (క్రిటిక్స్) కేటగిరీలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వచ్చిన ట్రయల్ బై ఫైర్ అవార్డు అందుకుంది.
ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2023 లిస్ట్ ఇదే
బెస్ట్ సిరీస్ - స్కూప్
బెస్ట్ సిరీస్ క్రిటిక్స్ - ట్రయల్ బై ఫైర్
బెస్ట్ డైరెక్టర్ సిరీస్ - విక్రమాదిత్య మోత్వానే (జూబ్లీ)
బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్స్ - రణ్‌దీప్ ఝా (కోహ్రా)
బెస్ట్ యాక్టర్, సిరీస్ (మేల్) డ్రామా - సువీందర్ విక్కీ (కోహ్రా)
బెస్ట్ యాక్టర్, సిరీస్ (మేల్) క్రిటిక్స్ డ్రామా - విజయ్ వర్మ (దహాద్)
బెస్ట్ యాక్టర్ సిరీస్ (ఫిమేల్): డ్రామా - రాజశ్రీ దేశ్ పాండే (ట్రయల్ బై ఫైర్)
బెస్ట్ యాక్టర్ సిరీస్ (ఫిమేల్), క్రిటిక్స్: డ్రామా - కరిష్మా తన్నా (స్కూప్), సోనాక్షి సిన్హా (దహాద్)
బెస్ట్ కామెడీ (సిరీస్/స్పెషల్స్) - టీవీఎఫ్ పిచర్స్ సీజన్ 2
బెస్ట్ ఫిల్మ్, వెబ్ ఒరిజినల్ - సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
బెస్ట్ యాక్టర్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (మేల్) - మనోజ్ బాజ్‌పాయీ (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై)
బెస్ట్ యాక్టర్, క్రిటిక్స్ (మేల్): ఫిల్మ్ - రాజ్‌కుమార్ రావ్ (మోనికా ఓ మై డార్లింగ్)
బెస్ట్ యాక్టర్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (ఫిమేల్) - ఆలియా భట్ (డార్లింగ్స్)