ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: 13 అవార్డులతో లాపతా లేడీస్ సంచలనం.. ఉత్తమ నటులు అభిషేక్, కార్తీక్‌.. నటిగా అలియా-filmfare awards 2025 winners full list laapataa ladies sets new record with 13 awards best actors alia abhishek ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: 13 అవార్డులతో లాపతా లేడీస్ సంచలనం.. ఉత్తమ నటులు అభిషేక్, కార్తీక్‌.. నటిగా అలియా

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: 13 అవార్డులతో లాపతా లేడీస్ సంచలనం.. ఉత్తమ నటులు అభిషేక్, కార్తీక్‌.. నటిగా అలియా

ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫిల్మ్ ఫేర్ 2025 అవార్డులు అనౌన్స్ చేశారు. ఈ అవార్డుల్లో లాపతా లేడీస్ ఏకంగా 13 అవార్డులతో సంచలనం నమోదు చేసింది. ఉత్తమ నటులుగా అభిషేక్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్.. ఉత్తమ నటిగా అలియా భట్ పురస్కారాలు దక్కించుకున్నారు.

ఫిల్మ్ ఫేర్ 2025 అవార్డులు

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక శనివారం అహ్మదాబాద్‌లోని కంకారియా సరస్సు వద్ద ఉన్న ఏక ఎరీనాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ వేడుకలో షారుఖ్, కృతి సనన్, కాజోల్ తదితరులు తమ ప్రదర్శనలతో అలరించారు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

ఫిల్మ్‌ఫేర్ 2025 అవార్డుల్లో 'లాపతా లేడీస్' సినిమా అదరగొట్టింది. ఏకంగా 13 అవార్డులు ఖాతాలో వేసుకుంది. ఉత్తమ చిత్రంగానూ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఒకే సినిమా అత్యధిక అవార్డులు గెలుచుకున్న రికార్డును (గల్లీ బాయ్ కూడా 13 గెలుచుకుంది) సమం చేసింది. అభిషేక్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడి (ప్రధాన పాత్ర) ట్రోఫీని పంచుకోగా, అలియా భట్ ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.

విజేతల పూర్తి జాబితా

ఉత్తమ నటుడు (ప్రధాన పాత్ర) -- అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)

ఉత్తమ నటి (ప్రధాన పాత్ర) -- అలియా భట్ (జిగ్రా)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) -- రాజ్‌కుమార్ రావు (శ్రీకాంత్)

ఉత్తమ నటి (క్రిటిక్స్) -- ప్రతిభా రంటా (లాపతా లేడీస్)

ఉత్తమ సహాయ నటి -- ఛాయా కదమ్ (లాపతా లేడీస్)

ఉత్తమ సహాయ నటుడు -- రవి కిషన్ (లాపతా లేడీస్)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) -- షూజిత్ సర్కార్ (ఐ వాంట్ టు టాక్)

ఉత్తమ నూతన నటి -- నితాన్షి గోయల్ (లాపతా లేడీస్)

ఉత్తమ నూతన నటుడు -- లక్ష్య (కిల్)

ఉత్తమ నూతన దర్శకుడు -- కునాల్ ఖేము (మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్), ఆదిత్య సుహాస్ జంభాలే (ఆర్టికల్ 370)

ఉత్తమ యాక్షన్ -- సియంగ్ ఓ, పర్వేజ్ షేక్ (కిల్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే -- స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)

ఉత్తమ కథ -- ఆదిత్య ధర్, మోనాల్ ఠక్కర్ (ఆర్టికల్ 370)

ఉత్తమ సంభాషణలు -- స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)

ఉత్తమ సంగీత ఆల్బమ్ -- రామ్ సంపత్ (లాపతా లేడీస్)

ఉత్తమ సాహిత్యం -- ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)

ఉత్తమ నేపథ్య గాయకుడు -- అరిజిత్ సింగ్ (లాపతా లేడీస్)

ఉత్తమ నేపథ్య గాయని -- మధుబంతి బాగ్చి (స్త్రీ 2)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే -- రితేష్ షా, తుషార్ శీతల్ జైన్ (ఐ వాంట్ టు టాక్) ఉత్తమ చిత్రం -- లాపతా లేడీస్

ఉత్తమ దర్శకుడు -- కిరణ్ రావు (లాపతా లేడీస్)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) -- ఐ వాంట్ టు టాక్ (షూజిత్ సర్కార్)

ఉత్తమ సౌండ్ డిజైన్ -- సుభాష్ సాహూ (కిల్)

ఉత్తమ నేపథ్య సంగీతం -- రామ్ సంపత్ (లాపతా లేడీస్)

ఉత్తమ వీఎఫ్ఎక్స్ -- రీడిఫైన్ (ముంజ్యా)

ఉత్తమ కొరియోగ్రఫీ -- బాస్కో-సీజర్ (తౌబా తౌబా - బ్యాడ్ న్యూజ్)

ఉత్తమ ఎడిటింగ్ -- శివకుమార్ వి. పనికర్ (కిల్)

ఉత్తమ కాస్ట్యూమ్స్ -- దర్శన్ జలాన్ (లాపతా లేడీస్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ -- మయూర్ శర్మ (కిల్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ -- రఫే మెహమూద్ (కిల్)

ప్రత్యేక అవార్డులు:

జీవిత సాఫల్య పురస్కారం -- జీనత్ అమన్, శ్యామ్ బెనెగల్ (మరణానంతరం) ఆర్‌డి బర్మన్ అవార్డు (సంగీతంలో వర్ధమాన ప్రతిభ) -- అచింత్ ఠక్కర్ (జిగ్రా, మిస్టర్ & మిసెస్ మహి)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం