Ram Charan: రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, ఏమైనా తప్పు చేశాడా? ఇంట్లో సోదాలు.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందు ట్వీట్స్ వైరల్!-film critic umair sandhu comments on ram charan says he has so much haters on social media why over game changer release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, ఏమైనా తప్పు చేశాడా? ఇంట్లో సోదాలు.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందు ట్వీట్స్ వైరల్!

Ram Charan: రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, ఏమైనా తప్పు చేశాడా? ఇంట్లో సోదాలు.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందు ట్వీట్స్ వైరల్!

Sanjiv Kumar HT Telugu
Jan 08, 2025 02:12 PM IST

Film Critic Umair Sandhu About Ram Charan Has Haters: రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, సోషల్ మీడియాలో అతనికి ఎందుకు అంత మంది హేటర్స్ ఉన్నారంటూ సౌత్ ఫిల్మ్ క్రిటిక్‌ ఉమైర్ సంధు ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌కు అనేకమంది నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, ఏమైనా తప్పు చేశాడా? ఇంట్లో సోదాలు.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందు ట్వీట్స్ వైరల్!
రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, ఏమైనా తప్పు చేశాడా? ఇంట్లో సోదాలు.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందు ట్వీట్స్ వైరల్!

Film Critic Umair Sandhu About Ram Charan Has Haters: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ మెగా పవర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు. చిరుత, మగధీర, ధ్రువ, రంగస్థలం వంటి సినిమాలతో హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు.

yearly horoscope entry point

గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు

ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో నటనలో మరో మెట్టుకు ఎదిగిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో వరల్డ్ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు. మళ్లీ RRR మూవీ రేంజ్‌లో హిట్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న రామ్ చరణ్ నటించిన కొత్త సినిమానే గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కార్తీక్ సుబ్బరాజు కథ

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచారు. కార్తీక్ సుబ్బరాజు కథ అందించిన ఈ సినిమాకు దిల్ రాజు, ఆదిత్యరామ్, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ సరసన మరోసారి హీరోయిన్‌గా జోడీ కట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ.

గేమ్ ఛేంజర్ బడ్జెట్

సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న సంక్రాంతి గిఫ్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంటే, గేమ్ ఛేంజర్ మూవీకి మరో రెండు రోజుల సమయం ఉందనగా రామ్ చరణ్‌పై సౌత్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనిపై ఎందుకంత ద్వేషం అంటూ ఉమైర్ సంధు కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

కారణం నాకు తెలియట్లేదు

"సోషల్ మీడియాలో రామ్ చరణ్‌పై ఎందుకు అంత ద్వేషం, ఎందుకు అంతమంది ద్వేషిస్తున్నారు. దానికి కారణం నాకు తెలియడం లేదు. అతను ఏమైనా తప్పు చేశాడా?" అని ఎక్స్‌లో ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్స్ పలు విధాలుగా ఈ ట్వీట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.

దేవర కథ తెలియాల

"అతనంటే అసూయ. ఎందుకంటే అతనికి ఉజ్బెకిస్తాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం" అని ఓ నెటిజన్ రాసుకొస్తే.. "అది తెలియాలంటే ముందు మా దేవర కథ తెలియాల" అని మరొకరి ఫన్నీగా కామెంట్ చేశారు. మరికొందరు "నీకెందుకురా" అంటూ ఉమైర్ సంధును విమర్శిస్తున్నారు. ఇలా ఉమైర్ సంధు ట్వీట్‌పై పాజిటివ్, నెగెటివ్స్‌తో కామెంట్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే, రీసెంట్‌గా గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ అంటూ ఉమైర్ సంధు మూవీపై తీవ్రంగా నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. ఆ ట్వీట్ చాలా వైరల్ అయింది. దాని తర్వాత "గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ రివ్యూ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మా అంకుల్ ఇంట్లో పోలీసులు, ప్రభుత్వ అధికారులు సోదాలు చేస్తున్నారు" అని మరో ట్వీట్ చేశాడు ఉమైర్ సంధు.

ఇదే కాకుండా ఇలా పలు రకాల ట్వీట్స్‌‌తో ఉమైర్ సంధు వార్తల్లో నిలుస్తున్నాడు. మొత్తానికి ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌తో మరోసారి అతనితోపాటు రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ మూవీ హాట్ టాపిక్ అవుతున్నారు.

Whats_app_banner