Fighter OTT Release: హృతిక్ రోష‌న్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫైట‌ర్ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే - హోళీ పండుగ‌కు రిలీజ్‌-fighter ott release date when and where to watch hrithik roshan deepika padukone action movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fighter Ott Release: హృతిక్ రోష‌న్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫైట‌ర్ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే - హోళీ పండుగ‌కు రిలీజ్‌

Fighter OTT Release: హృతిక్ రోష‌న్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫైట‌ర్ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే - హోళీ పండుగ‌కు రిలీజ్‌

Fighter OTT Release Date: హృతిక్ రోష‌న్‌, దీపికా ప‌డుకోణ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఫైట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. హోళీ పండుగ వీక్‌లో ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానున్న‌ట్లు తెలిసింది.

హృతిక్ రోష‌న్‌, దీపికా ప‌డుకోణ్ ఫైట‌ర్ మూవీ

Fighter OTT Release Date: హృతిక్ రోష‌న్ ఫైట‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ మూవీ ఆరు రోజుల్లో 215 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. హోళీ పండుగ సంద‌ర్భంగా మార్చి చివ‌రి వారంలో ఫైట‌ర్‌ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్న‌ట్లు తెలిసింది.

ఫైట‌ర్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ రికార్డ్ ధ‌ర‌కు ద‌క్కించుకున్న‌ది. దాదాపు 75 కోట్ల‌కు హృతిక్ రోష‌న్ మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. థియేట‌ర్ల‌లో కేవ‌లం హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే రిలీజైంది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఫైట‌ర్ మూవీని స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మార్చి 29న ఫైట‌ర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు హిందీ సినీ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

క‌లెక్ష‌న్స్ డ్రాప్‌...

ఆదివారం వ‌ర‌కు ఫైట‌ర్ మూవీ భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. సోమ‌వారం నుంచి క‌లెక్ష‌న్స్ త‌గ్గుముఖం ప‌ట్టాయి. మంగ‌ళ‌వారం థియేట‌ర్ వ‌ర్గాల‌ను ఈ మూవీ పూర్తిగా డిస‌పాయింట్ చేసింది. ఈరిప‌బ్లిక్ డే రోజు దాదాపు 39.5 కోట్ల వ‌సూళ్ల‌ను ఫైట‌ర్ మూవీ రాబ‌ట్టింది. రిలీజ్ రోజు కూడా 22.5 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

ఆదివారం రోజు 29 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ సోమ‌వారం నుంచి పూర్తిగా డీలా ప‌డింది. సోమ‌వారం రోజు ఎనిమిది కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మంగ‌ళ‌వారం రోజు క‌లెక్ష‌న్స్ 7.25 కోట్ల‌కుప‌డిపోవ‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌కు షాకిస్తోంది. మొత్తంగా ఆరు రోజుల్లో 215 కోట్ల వ‌సూళ్ల‌ను ఫైట‌ర్ మూవీ ద‌క్కించుకున్న‌ది. బుధ‌వారం వ‌సూళ్లు మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

ప‌ఠాన్ సేమ్ డేట్‌...

ఫైట‌ర్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ గ‌త సినిమా ప‌ఠాన్ కూడా 2023 రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజైంది. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన ఈ మూవీ ఆరు రోజుల్లోనే మూడు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప‌ఠాన్‌తో పోలిస్తే క‌లెక్ష‌న్స్ రేసులో ఫైట‌ర్ చాలా వెనుక‌బ‌డిపోయింది.

హృతిక్‌, దీపికా ఫ‌స్ట్ టైమ్‌...

ఫైట‌ర్ మూవీలో హృతిక్‌రోష‌న్‌, దీపికా ప‌డుకోణ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఫ‌స్ట్ టైమ్ దీపికా, హృతిక్ జంట‌గా న‌టించిన మూవీ ఇది. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో దాదాపు 275 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫైట‌ర్ మూవీలో సంషేర్ ప‌ఠానియా అనే వైమానిక ద‌ళం స్క్వాడ్రాన్ లీడ‌ర్‌గా హృతిక్ రోష‌న్ యాక్టింగ్‌, అత‌డిపై షూట్ చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

హృతిక్‌, దీపికా ప‌డుకోణ్ కెమిస్ట్రీ కూడా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫైట‌ర్‌లో అనిల్ క‌పూర్‌, క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఫైట‌ర్ త‌ర్వాత వార్ 2 సినిమా చేయ‌బోతున్నాడు హృతిక్ రోష‌న్‌. ఈ సినిమాలో హృతిక్ రోష‌న్‌తో పాటు ఎన్టీఆర్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఫైట‌ర్ మూవీకి బ్ర‌హ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.