Bigg Boss Telugu 6 Episode 90: రోహిత్-ఇనాయా ఫైట్.. సంచాలక్ నిర్ణయం వరస్ట్ అంటూ ఆదిరెడ్డి ఫైర్
Bigg Boss Telugu 6 Episode 90: బిగ్‌బాస్ 6లో ప్రస్తుతం జరుగుతున్న టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో ఇనాయా-రోహిత్ మధ్య గొడవ జరిగింది. సంచాలక్ నిర్ణయం ఫెయిర్‌గా లేదని ఆమెతో రోహిత్ వాదనకు దిగుతాడు.
Bigg Boss Telugu 6 Episode 90: బిగ్బాస్ 6 గత సీజన్ల కంటే ఈ సారి పెద్దగా ఆకట్టుకోవడం లేదనే చెప్పాలి. ప్రతిసారి టికెట్ టూ ఫినాలే టాస్క్ అంటే ఎంతో రసవత్తరంగా కంటెస్టెంట్లు చివరి వరకు పోరాడి గెలుస్తారు. కానీ ఈ సారి మాత్రం షో నిర్వాహకులు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని హౌస్ మేట్స్‌కే ఇవ్వడంతో పెద్దగా ఆసక్తికరంగా లేదనే చెప్పాలి. అందరూ నేను తప్పుకోనంటే నేను తప్పుకోనంటూ వాదులాటకు దిగారు. టికెట్ టూ ఫినాలే రేసులో ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్, ఫైమా, రోహిత్ ఇలా ఐదుగురు మిగిలారు. అయితే తదుపరి ఛాలెంజ్‌లో వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే పోటీపడాలన్నాడు బిగ్‌బాస్. మరోసారి ఏకాభిప్రాయం ఆదేశం ఇవ్వడంతో హౌస్ మేట్స్ అందుకు ససేమిరా అన్నారు. దీంతో సంచాలకులుగా ఉన్న శ్రీసత్య, కీర్తి, ఇనాయాలను నిర్ణయం తీసుకోమని చెప్పారు.
అయితే ఇనాయా, కీర్తి, శ్రీసత్య మాత్రం టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను కాదని వదిలేసి చివర్లో ఉన్న రేవంత్, ఫైమా, రోహిత్‌కు అవకాశమిస్తున్నట్లు చెబుతారు. టాప్‌లో ఉన్నవాళ్లను తీసేసి వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వడమేంటి? ఈ సీజన్‌లో ఇదే వరస్ట్ డెసిషన్ అంటూ ఆదిరెడ్డి చిరాకు పడ్డాడు. అనంతరం రోహిత్ కూడా ఆలోచించి.. ఈ నిర్ణయం ఫెయిర్‌గా లేదని తను టాస్క్ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేస్తాడు. అనంతరం వెనక్కు తగ్గిన సంచాలకులు తమ నిర్ణయం మార్చుకుని ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్‌కు అవకాశమిస్తారు. చివర్లో ఉన్న రోహిత్ ఆడను అనడం వల్ల ఫైమాను కూడా తొలగించామని ఇనాయ చెబుతుంది. ఆ మాటకు రోహిత్ సీరియస్ అవుతాడు. నా వల్ల ఫైమాను తీసేయడమేంటి.. ఏం మాట్లాడుతున్నావ్.. ఏం చెప్పాలని అనుకుంటున్నావ్.. చెత్త నిర్ణయమని ఫైర్ అవుతాడు. ఈ గొడవ కాస్త అమ్మాయిలు, అబ్బాయిలుగా మారుతుంది. సంచాలక్‌గా నిర్ణయం తీసుకోవడం మా ఇష్టం అని వీళ్లు అంటే.. అలా ఎలా తీసుకుంటారని వాళ్లు ఇద్దరూ కలిసి బిగ్‌బాస్ హౌస్‌ను హోరెత్తించారు.
మరోపక్క శ్రీహాన్ కూడా ప్రతి ఒక్కరికి అవకాశమివ్వడానికి ఫన్ డే టాస్క్ కాదని, ఫినాలే టాస్క్ అని కోపంతో ఊగిపోతాడు. ఫైమాను పక్కకు తప్పించడంతో ఆమె ఎమోషనలై ఏడ్చింది. ఈ సందర్భంలో రేవంత్ ఇంతసేపు బాగానే ఉంది కదా.. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందంటూ రేవంత్ అనవసర గొడవ పెట్టుకుంటాడు. సంచాలక్‌గా నేనైతే ఇలా చేసేవాడిని కాదని, అసలు వీళ్లెవరు బిగ్‌బాస్? మా ఆటను డిసైడ్ చేయడానికి ఫైర్ అవుతాడు. సంచాలకులుగా వీరు ముగ్గురు వేస్ట్ అని స్పష్టం చేస్తాడు. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదంటూ రేవంత్ మరోసారి తన నోటిదురుసును ప్రదర్శించాడు.
సంచాలకులు నిర్ణయాన్ని వ్యతిరేకించి రోహిత్.. జనాల హృదయాలను మాత్రం గెల్చుకున్నాడు. అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో అతడికి బాగా తెలుసు. తన ప్రవర్తనతో టాప్-5లో తప్పకుండా ఉంటాడని టాక్ వినిపిస్తోంది.
ఈ గొడవ తర్వాత బిగ్‌బాస్ బెలూన్లు ఊదే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్‌లో రేవంత్ అందరికంటే ఎక్కువ బెలూన్లు ఊది టాప్‌కు చేరుతాడు. అనంతరం ఆదిరెడ్డి, శ్రీహాన్ 14 పాయింట్లతో సమానంగా ఉండగా.. బిగ్‌బాస్ మళ్లీ అదే టాస్క్ ఇస్తాడు. ఓడిపోయిన టాస్కే ఎలా ఇస్తారు బిగ్‌బాస్ అంటూ ఆదిరెడ్డి ఫీలవుతాడు. బెలూన్లు ఊదడంలో విఫలమైన ఆదిరెడ్డి మూడో స్థానానికి పడిపోతాడు. దీంతో టాప్-2లో రేవంత్, శ్రీహాన్ టికెట్ టూ ఫినాలే కోసం జరిగే చివరి ఛాలెంజ్‌లో పోటీ పడతారు. ఎపిసోడ్ పూర్తయ్యే సరికి ఈ టాస్క్ ఇంకా జరగలేదు. అనధికార సమాచారం ప్రకారం ఈ పోటీలో శ్రీహాన్ టికెట్ టూ ఫినాలే సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్టుగా ఎంపికైనట్లుగా తెలుస్తోంది.
సంబంధిత కథనం