Fatima Sana Shaikh: నువ్వు అన్నీ చేస్తావు కదా అని అడిగాడు.. ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడతారు:బాలీవుడ్ నటి-fatima sana shaikh on casting couch in south film industry reveals about a incident ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fatima Sana Shaikh: నువ్వు అన్నీ చేస్తావు కదా అని అడిగాడు.. ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడతారు:బాలీవుడ్ నటి

Fatima Sana Shaikh: నువ్వు అన్నీ చేస్తావు కదా అని అడిగాడు.. ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడతారు:బాలీవుడ్ నటి

Hari Prasad S HT Telugu
Jan 27, 2025 10:20 PM IST

Fatima Sana Shaikh: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. నువ్వు అన్నీ చేస్తావు కదా అని ఓ ఏజెంట్ అడిగాడని, ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్ గా మాట్లాడతారని అనడం గమనార్హం.

నువ్వు అన్నీ చేస్తావు కదా అని అడిగాడు.. ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడతారు:బాలీవుడ్ నటి
నువ్వు అన్నీ చేస్తావు కదా అని అడిగాడు.. ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడతారు:బాలీవుడ్ నటి (Instagram)

Fatima Sana Shaikh: బాలీవుడ్ నటి, దంగల్ మూవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సాధారణం అన్నట్లుగా ఆమె మాట్లాడింది. బాలీవుడ్ బబుల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాతిమా మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.

yearly horoscope entry point

నువ్వ అన్నీ చేస్తావ్ కదా అన్నాడు: ఫాతిమా

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఈ ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ.. ఓ ఏజెంట్ తో తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది. "నువ్వు అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా అని అతడు అడిగాడు.

నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేయడానికి నేను చాలా కష్టపడతాను అని నేను అన్నాను. కానీ అతడు మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నేను కూడా అతడు ఎంతకు దిగజారతాడో చూద్దామని ఏమీ తెలియనట్లే మాట్లాడాను" అని ఫాతిమా చెప్పింది.

ప్రొడ్యూసర్లు ఓపెన్‌గా మాట్లాడుకుంటారు

ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటారని కూడా ఫాతిమా చెప్పింది. హైదరాబాద్ లో జరిగిన ఘటన గురించి చెప్పుకొచ్చింది.

"ప్రొడ్యూసర్లు కూడా దీని గురించి ఓపెన్ గా మాట్లాడేవారు. ఇక్కడ నువ్వు కొందరిని కలవాల్సి ఉంటుంది అని అనేవాళ్లు. నేరుగా చెప్పేవాళ్లు కాదు కానీ.. దానిని రకరకాలుగా చెప్పేవాళ్లు. ఎలా చెప్పినా వాళ్ల ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయేది. వాళ్లను కలవాల్సి ఉంటుంది.. ఇలా చేయాల్సి ఉంటుంది అని అనేవాళ్లు" అని ఫాతిమా చెప్పింది.

అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ అలాగే వ్యవహరించరని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే కొందరు ప్రముఖ నటీనటులు కూడా ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడం మాత్రం బాధాకరమని ఆమె అభిప్రాయపడింది.

2016లో వచ్చిన దంగల్ మూవీలో రెజ్లర్ గీతా ఫోగాట్ పాత్ర పోషించిన ఫాతిమా.. ప్రస్తుతం మెట్రో ఇన్ దనో మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెతోపాటు ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠీ, కొంకనా సేన్ శర్మ, అలీ ఫజల్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం