OTT Movie: మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న తండ్రీ కొడుకుల సెంటిమెంట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-father and son sentiment telugu movie dear nanna to stream on etv ott platform win after aha ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న తండ్రీ కొడుకుల సెంటిమెంట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Movie: మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న తండ్రీ కొడుకుల సెంటిమెంట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jul 29, 2024 01:45 PM IST

Dear Nanna OTT: డియర్ నాన్న సినిమా మరో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. చైతన్య రావ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. డేట్ ఖరారైంది.

OTT Movie: మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న తండ్రీ కొడుకుల సెంటిమెంట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Movie: మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న తండ్రీ కొడుకుల సెంటిమెంట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇటీవలి కాలంలో రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఆర్ధిక వెసులుబాటు కోసం కొన్ని చిత్రాలకు స్ట్రీమింగ్ హక్కులను ప్లాట్‍ఫామ్‍లు పంచుకుంటున్నాయి. తాజాగా మరో సినిమా కూడా రెండో ఓటీటీలో అడుగుపెట్టనుంది. అదే చైతన్య రావ్ హీరోగా నటించిన ‘డియర్ నాన్న’ చిత్రం. ఈ మూవీ ముందుగా ఆహా ఓటీటీలో నేరుగా జూన్ 14న అడుగుపెట్టింది. ఫాదర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు డియర్ నాన్న సినిమా మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోంది.

ఈటీవీ విన్‍లో ఎప్పుడంటే..

డియర్ నాన్న సినిమా ఆగస్టు 1వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ నేడు (జూలై 29) అధికారికంగా వెల్లడించింది. “డియర్ నాన్న. మన సినిమా, మన విన్‍లో. ఆగస్టు 1వ తేదీన నుంచి ప్రీమియర్ కానుంది” అని ఈవీటీ విన్ ట్వీట్ చేసింది.

డియర్ నాన్న మూవీకి అంజీ సాలాది దర్శకత్వం వహించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‍తో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చైతన్య రావ్, సూర్యకుమార్ భగవాన్ దాస్ ప్రధాన పాత్రలు చేశారు. చైతన్యకు జోడీగా యష్న మాతులూరి నటించారు. సీవీఎల్ నరసింహా రావు, సంధ్య, మధునందన్ కీలకపాత్రలు పోషించారు.

డియర్ నాన్న చిత్రాన్ని బ్లాక్ పెప్పర్ సినిమాస్ పతాకంపై రాకేశ్ మహంకాళి నిర్మించారు. గిఫ్టన్ ఎలాస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ చేశారు. తక్కువ బడ్జెట్‍తోనే ఈ మూవీ తెరకెక్కింది.

డియర్ నాన్న స్టోరీ

కరోనా నాటి పరిస్థితుల బ్యాక్‍డ్రాప్‍తో డియర్ నాన్న చిత్రం తెరకెక్కింది. పెద్ద చెఫ్ కావాలని సూర్య (చైతన్య రావ్) లక్ష్యంగా పెట్టుకుంటాడు. అందుకోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అతడి తండ్రి రవి (సూర్య భగవాన్‍దాస్) ఓ మెడికల్ షాప్ నడుపుతుంటారు. వ్యాపారంగా కాకుండా ఒక ప్యాషన్‍తో ఓ షాప్‍ను చూస్తుంటారు. సూర్యకు మెడికల్ షాప్‍పై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అయితే, ఓ దశలో రవికి కరోనా పాజిటివ్ వస్తుంది. దీంతో సూర్యనే మెడికల్ షాప్ నడపాల్సి వస్తుంది. మరి ఆ షాప్‍ను అతడు ఎలా నడిపాడు? తన తండ్రికి ఎంతో ఇష్టమైన దాన్ని కొనసాగించాడా? చెఫ్ కావాలనుకున్న తన కలను వదిలేశాడా? అనేదే డియర్ నాన్న సినిమా కథలో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.

నేరుగా వీరాంజనేయులు విహారయాత్ర

వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. సీనియర్ యాక్టర్ నరేశ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ కామెడీ డ్రామా మూవీ ఆగస్టు 14వ తేదీన ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ చిత్రంలో అస్థికలకు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం డబ్బింగ్ చేశారు. అస్థికలను గోవాలో కలిపేందుకు ఓ కుటుంబం చేసే విహారయాత్ర చుట్టూ ఈ సినిమా సాగుతుంది. వీరాంజనేయులు విహారయాత్ర మూవీకి అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. ఆగస్టు 14 నుంచి ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‍లో చూడొచ్చు.

Whats_app_banner