Lakshmi Manchu: ప్రొడ్యూసర్‌గా మంచు లక్ష్మి - సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దక్ష - మోహన్‌బాబు స్పెషల్ రోల్
Lakshmi Manchu: మోహన్‌బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. దక్ష టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేసవిలోనే దక్ష మూవీ రిలీజ్ కానుంది.
Lakshmi Manchu: మంచు లక్ష్మి ప్రొడ్యూసర్‌గా మారింది. ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు దక్ష అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోండగా... ఆమె తండ్రి, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు.
మోహన్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకొని బుధవారం ఓ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవర్‌ఫుల్ లుక్‌లో మోహన్‌బాబు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును రివీల్ చేశారు. దక్ష మూవీలో డాక్టర్ విశ్వామిత్ర పాత్రలో మోహన్‌బాబు కనిపించనున్నాడు. సినిమాలో ఆయన పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని సమాచారం.
తొలి మూవీ ఇది...
మోహన్‌బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి మూవీ ఇది. మంచు ఎంటర్ టైన్మెంట్,శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లపై మోహన్‌బాబుతో కలిసి మంచు లక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తోంది. మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న దక్ష సినిమాకు వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నాడు.
డైమండ్ రత్నబాబు కథను అందిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో ఆమె నటిస్తోన్నట్లు తెలిసింది.
మార్కో యాక్టర్....
దక్ష మూవీలో మలయాళ నటుడు, మార్కో ఫేమ్ సిద్ధిఖీతో పాటు విశ్వాంత్, చిత్రాశుక్ల, వీరేన్ కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఈ తెలుగు మూవీకి అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నాడు. దక్ష మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ వేసవిలోనే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు.
లాంగ్ గ్యాప్ తర్వాత...
దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత దక్ష మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మంచు లక్ష్మి. అనగనగా ఒక ధీరుడు మూవీ ద్వారా విలన్ పాత్రతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. ఆ తర్వాత దొంగల ముఠా, గుండెల్లో గోదారి, లక్ష్మీబాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, పిట్టకథలుతో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. యక్షిణి, మిస్ సుబ్బలక్ష్మి వెబ్‌సిరీస్‌లలో నటించింది.
యాక్టింగ్‌కే పరిమితం ప్రేమతో మీ లక్ష్మి, లక్ష్మి టాక్ షో, మేము సైతం వంటి టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది.
సంబంధిత కథనం