జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఇందులో చిట్టి పాత్రతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్‌గా అలరిస్తోంది ఫరియా అబ్దుల్లా.
ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో, డిఫరెంట్ టైటిల్‌తో రానుంది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమానే గుర్రం పాపిరెడ్డి. ఓటీటీ సిరీస్ వికటకవితో మంచి పేరు తెచ్చుకున్న నరేష్ అగస్త్య గుర్రం పాపిరెడ్డి మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు.
డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ గుర్రం పాపిరెడ్డి సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న "గుర్రం పాపిరెడ్డి" సినిమా మోషన్ పోస్టర్‌ను రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
"గుర్రం పాపిరెడ్డి" మూవీ మోషన్ పోస్టర్ పూర్తిగా కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. పర్‌ఫెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉంటుందో ఈ మోషన్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్‌ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్‌లో కాంటెంపరరీగా, స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు మురళీ మనోహర్.
మోషన్ పోస్టర్‌లోని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్, కామెడీ హైలైట్‌గా నిలుస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇకపోతే గుర్రం పాపిరెడ్డి సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లాతోపాటు బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే, జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఆ తర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా 2 వంటి సినిమాలతో అలరించింది. అలాగే, రవితేజ రావాణాసుర సినిమాలో ఒక హీరోయిన్‌గా చేసిన ఫరియా అబ్దుల్లా ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో ఓ సాంగ్‌లో తళుక్కుమంది.
సంబంధిత కథనం