Faraaz trailer: మీలాంటి వాళ్ల నుంచి మా ఇస్లాం మాకు కావాలి.. అదిరిపోయిన ఫరాజ్‌ ట్రైలర్‌-faraaz trailer released as the movie mark the debut of shashi kapoors grandson zahaan kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Faraaz Trailer Released As The Movie Mark The Debut Of Shashi Kapoors Grandson Zahaan Kapoor

Faraaz trailer: మీలాంటి వాళ్ల నుంచి మా ఇస్లాం మాకు కావాలి.. అదిరిపోయిన ఫరాజ్‌ ట్రైలర్‌

Hari Prasad S HT Telugu
Jan 16, 2023 05:21 PM IST

Faraaz trailer: మీలాంటి వాళ్ల నుంచి మా ఇస్లాం మాకు కావాలి అంటూ ఫరాజ్‌ మూవీ ట్రైలర్‌ సోమవారం (జనవరి 16) రిలీజైంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు శశి కపూర్‌ మనవడు నటించిన ఈ సినిమాకు హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించాడు.

ఫరాజ్ మూవీలో ఓ సీన్
ఫరాజ్ మూవీలో ఓ సీన్

Faraaz trailer: బాలీవుడ్‌లో మరో థ్రిల్లర్‌ మూవీ రాబోతోంది. షాహిద్‌, సిటీలైట్స్‌, అలీగఢ్‌, సిమ్రన్‌, ఒమెర్టాలాంటి మూవీస్‌తోపాటు స్కామ్ 1992లాంటి అదిరిపోయే వెబ్‌ సిరీస్‌ అందించిన డైరెక్టర్‌ హన్సల్‌ మెహతా తీసిన మూవీ ఇది. దీనిపేరు ఫరాజ్‌. ఈ మూవీ ట్రైలర్‌ సోమవారం (జనవరి 16) రిలీజైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌పై 2016లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ సినిమా తీశారు.

రెండు నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్‌ థ్రిల్లింగ్‌గా ఉంది. ఢాకాలోని హోలీ ఆర్టిసాన్‌ కెఫేపై జులై 1,2016న జరిగిన దాడి ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ట్రైలర్‌ కూడా సరిగ్గా అదే డేట్‌తో మొదలవుతుంది. ఆ కెఫేలో ఓ సాయంత్రాన్ని హాయిగా ఎంజాయ్‌ చేస్తున్న సాధారణ పౌరులపై ఉన్నట్లుండి బుల్లెట్ల వర్షం కురుస్తుంది. కొందరు ఉగ్రవాదులు చేతుల్లో తుపాకులు పట్టుకొని విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడుతుంటారు.

ఈ దాడిలోనే అసువులు బాసిన ఫరాజ్‌ హుస్సేన్‌ అనే 20 ఏళ్ల యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బంగ్లాదేశ్‌ మీడియా మొఘల్‌గా పేరుగాంచిన లతీఫుర్‌ రెహమాన్‌ మనవడే ఈ ఫరాజ్‌. ఈ ఉగ్రదాడిలో అతడు కూడా చనిపోయాడు. ఫరాజ్‌ మూవీలో ఆ క్యారెక్టర్‌ను శశి కపూర్‌ మనవడు, కునాల్ కపూర్‌ తనయుడు జహాన్‌ కపూర్‌ పోషించాడు.

ఇక ఉగ్రవాదుల్లో ఒకడిగా నటుడు పరేష్ రావల్‌ తనయుడు ఆదిత్య రావల్‌ నటించడం విశేషం. ఆ ఉగ్రదాడిలో కెఫేలోని పిలలను రక్షించడానికి ఫరాజ్‌ ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఒకరిని చంపడాన్ని ఇస్లాం ఎప్పుడూ అంగీకరించదని అతడు ఉగ్రవాదులతో పోరాడటాన్ని ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. అసలు నీకేం కావాలి అంటూ ఓ ఉగ్రవాది అడుగుతాడు.

అప్పుడు మీలాంటి వాళ్ల నుంచి మా ఇస్లాం తిరిగి కావాలి అని ఫరాజ్‌ అంటాడు. ఆ డైలాగ్‌తో ట్రైలర్‌ ముగుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతోంది. ఈ ట్రైలర్‌ ప్రేక్షకులకు బాగా నచ్చింది. టీ-సిరీస్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. చాలా మంది పాజిటివ కామెంట్స్‌ చేశారు. హన్సల్‌ మెహతా, అనుభవ్‌ సిన్హాలాంటి వాళ్ల పేర్లు చాలు అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు.

ఈ సినిమా ద్వారా అసలు హింస వెనుక ఉన్న అసలు ఉద్దేశం, వీటికి యువత ఎలా అట్రాక్ట్‌ అవుతున్నారనేది చూపించాలని అనుకున్నట్లు డైరెక్టర్‌ హన్సల్‌ మెహతా చెప్పాడు. ఈ ఫరాజ్‌ మూవీ గతేడాది లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనే ప్రదర్శితమైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం