70 ఏళ్ల వ‌య‌సులో ఈ లిప్‌కిస్‌లు, రొమాన్స్ ఏంటీ? క‌మ‌ల్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్!-fans strange reactions on kamal hasan lipkiss with trisha and abhirami in thuglife trailor social media trolls viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  70 ఏళ్ల వ‌య‌సులో ఈ లిప్‌కిస్‌లు, రొమాన్స్ ఏంటీ? క‌మ‌ల్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్!

70 ఏళ్ల వ‌య‌సులో ఈ లిప్‌కిస్‌లు, రొమాన్స్ ఏంటీ? క‌మ‌ల్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్!

మే 17న విడుదలైన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ చూశాక కొంతమంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కమల్ హాసన్ లిప్ కిస్ లు, రొమాన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ వయసులో ఇదేం పని అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

థగ్ లైఫ్ ట్రైలర్ లో త్రిష, కమల్ హాసన్

యాక్షన్ సీక్వెన్స్.. ఇంటెన్సివ్ డ్రామాతో ‘థగ్ లైఫ్’ ట్రైలర్ అదిరిపోయింది. తండ్రీ కొడుకుల మధ్య వార్ గా తెరకెక్కిన ఈ మూవీ లో కమల్ హాసన్, సిలంబరసన్ యాక్టింగ్ వేరే లెవల్ లో ఉండబోతుందని స్పష్టమైంది. కానీ ఈ ట్రైలర్ లో కొన్ని సీన్స్ పై మాత్రం ట్రోల్స్ మోత మోగుతోంది. ఈ వయసులో కమల్ హాసన్ లిప్ కిస్ లు, రొమాన్స్ ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.

ఆ ముద్దుపై

కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' ట్రైలర్ మే 17న రిలీజైంది. అయితే ఈ ట్రైలర్ లో ముఖ్యంగా కమల్ నటించిన ముద్దు సన్నివేశం, రొమాంటిక్ సీక్వెన్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిష తో రొమాంటిక్ సీన్స్.. ఇక అభిరామితో అయితే ఏకంగా లిప్ కిస్ హాట్ టాపిక్ గా మారాయి. కమల్ వయసు ఏంటీ? ఈ లిప్ కిస్ లు ఎందుకు? అని ట్రోల్స్ వస్తున్నాయి.

ఏజ్ గ్యాప్

ఒక రెడ్డిట్ యూజర్ థగ్ లైఫ్ ట్రైలర్ లోని కమల్ హాసన్, త్రిష కృష్ణన్ ల సన్నివేశం స్క్రీన్ షాట్ తో పాటు 42 ఏళ్ల అభిరామిని ముద్దుపెట్టుకున్న మరో ఫోటోను షేర్ చేసి "నో గాడ్ ప్లీజ్ నో" అని రాసుకొచ్చాడు. 70 ఏళ్ల కమల్, 42 ఏళ్ల త్రిష మధ్య ఏజ్ గ్యాప్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.

‘ఒక ముసలాయన యవ్వనంగా నటించి యువతులతో రొమాన్స్ చేయడం విచిత్రంగా ఉంది’ అని, అభిరామితో కమల్ ముద్దు సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ మరొకరు 'ఇది చాలా విచిత్రంగా ఉంది' అని పేర్కొన్నారు.

కూతురు వయసు

కమల్ హాసన్, త్రిష, అభిరామి ఏజ్ గ్యాప్ పై ఇప్పుడు చర్చ జోరందుకుంది. 'శ్రుతిహాసన్ కంటే త్రిష కేవలం మూడేళ్లు పెద్దది’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. కమల్ హాసన్ కూతురే శ్రుతి హాసన్ అన్న సంగతి తెలిసిందే. అంటే దాదాపు కూతురు వయసున్న అమ్మాయితో ఎలా రొమాన్స్ చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరోవైపు 'మణిరత్నం తన వారసత్వాన్ని నాశనం చేస్తున్నాడు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

‘‘40 ఏళ్ల నటితో కమల్ హాసన్ రొమాన్స్ చేస్తే ప్రాబ్లం ఉండదా? రూల్స్ కేవలం రవితేజ, చిరంజీవికేనా?’’ అని ఓ యూజర్ ప్రశ్నించాడు.

స్క్రీన్ షాట్
స్క్రీన్ షాట్ (reddit)

కమల్ కు సపోర్ట్

ఇక కొందరేమో కమల్ హాసన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఫైన్ వైన్ లాగా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ కమల్ అదరగొడుతున్నారని పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా థగ్ లైఫ్ ట్రైలర్ మాత్రం ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. మరోవైపు యూట్యూబ్ లో ఈ ట్రైలర్ దూసుకెళ్తోంది. ఇప్పటికే 30 మిలియన్ వ్యూస్ దాటేసింది.

1987 తర్వాత

1987 తర్వాత మరోసారి మణిరత్నం, కమల్ హాసన్ జతకట్టారు. మణిరత్నం దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్ లో కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, సన్యా మల్హోత్రా, అభిరామి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సరాఫ్, వైయాపురి తదితరులు నటించారు. 1987లో వచ్చిన 'నాయకన్' సినిమా తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలయికలో వస్తున్న చిత్రమిది. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం