మనిషికి, జంతువుకి తేడా పెళ్లి.. ఇవాళ ఓటీటీలోకి కదిలించే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. కూతురి వివాహం కోసం తండ్రి ఆరాటం-family emotional drama addam lo chandamama ott release date movie streaming on etv win today ott releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మనిషికి, జంతువుకి తేడా పెళ్లి.. ఇవాళ ఓటీటీలోకి కదిలించే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. కూతురి వివాహం కోసం తండ్రి ఆరాటం

మనిషికి, జంతువుకి తేడా పెళ్లి.. ఇవాళ ఓటీటీలోకి కదిలించే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. కూతురి వివాహం కోసం తండ్రి ఆరాటం

ఓటీటీలోకి ఇవాళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా వచ్చేసింది. ఫ్యామిలీ సంబంధాల విలువ, పెళ్లి గొప్పతనాన్ని చాటే మూవీ ఇది. కూతురి వివాహం కోసం ఆరాటపడే తండ్రి చుట్టూ ఈ మూవీ తిరుగుతోంది.

ఓటీటీలో ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ (x/etvwin)

ఓటీటీలోకి మరో హార్ట్ టచింగ్ ఫిల్మ్ ఒకటి అడుగుపెట్టింది. పెళ్లి గొప్పతనం గురించి చెప్పే మూవీ ఇది. కూతురు వివాహం కోసం ఆరాటపడే తండ్రి కథతో తెరకెక్కిన ‘అద్దంలో చందమామ’ సినిమా ఇవాళ (అక్టోబర్ 5) ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ ఫ్యామిలీ మూవీ ఆకట్టుకుంటోంది.

అద్దంలో చందమామ ఓటీటీ

తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అద్దంలో చందమామ సినిమా ఆదివారం ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథా సుధలో భాగంగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం అద్దంలో చందమామ సినిమా ఇలాగే రిలీజైంది.

ఈటీవీ విన్ ఓటీటీలో

అద్దంలో చందమామ సినిమా ఇవాళ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది. 35 నిమిషాలే ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ లో సీనియర్ యాక్టర్లు గోపరాజు రమణ, సురభి ప్రభావతితో పాటు దివ్య, కార్తీక్ నటించారు. ఈ చిత్రానికి గాట్రెడ్డి హరిప్రసాద్ డైరెక్టర్. ఎస్ఎంఎస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై సాయి మాధవ్ బుర్రా నిర్మించారు.

కథ ఏమిటంటే?

పెళ్లి వేరు ప్రేమ వేరు అనుకునే అమ్మాయికి వివాహం చేయాలనుకునే తండ్రి కథనే అద్దంలో చందమామ. ‘‘ప్రేమించుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ముందే ప్రేమించుకుంటే బతుకంతా ఉండాలని పెళ్లి చేసుకుంటారు’’ అని తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్పే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది.

‘రెడ్డీల అంటే మా వాళ్లు కాదా’ అని తల్లి పాత్ర అడుగుతుంది. మనిషికి, జంతువుకి తేడా పెళ్లి మాత్రమే. పెళ్లితో వచ్చే ఆ బంధాలు, బాధ్యతలు, కమిట్మెంట్స్ కలిసి జంతువు నుంచి మనిషిని సెపరేట్ చేస్తాయి అని చాటే సినిమా ఇది. మరి ఈ సినిమాలో ప్రేమ కథ కంచికి చేరుతుందా? అన్నది చూడాలి.

కథా సుధ స్ట్రీమింగ్

ఈటీవీ ఓటీటీలో కథా సుధలో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కథా సుధను కొనసాగిస్తోంది. కె.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఉన్నాయి ఇందులో. ఓ వైపు వరుస బ్లాక్ బస్టర్లను అందిస్తున్న ఈటీవీ విన్.. ఇలా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంది. ప్రతి వారం కొత్త కాన్సెప్ట్ తో, డిఫరెంట్ జోనర్లలో సినిమాలను అందిస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం