Bigg Boss 6 Telugu Elimination: రాజ్ కోసం ఫైమా త్యాగం చేస్తుందా - ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా
Bigg Boss 6 Telugu Elimination: ఈ వారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఫైమా, రాజ్‌లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎవిక్షన్ పాస్‌ను ఉపయోగించుకొని ఎలిమినేషన్ నుంచి ఫైమా బయటపడుతుందా లేదంటే క్లోజ్ ఫ్రెండ్ రాజ్ కోసం త్యాగం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Bigg Boss 6 Telugu Elimination: బిగ్‌బాస్ 6 తెలుగు నుంచి ఈ వారం ఫైమా, రాజ్‌లలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్‌లో రాజ్, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్, ఆదిరెడ్డి సేఫ్ అయినట్లుగా సమాచారం. కొత్తగా రిలీజ్ చేసిన ప్రోమోలో చివరికి నామినేషన్స్‌లో ఫైమా, రాజ్ మాత్రమే ఉన్నట్లుగా చూపించారు.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఫైమాకు ఎవిక్షన్ పాస్ ఉంది. ఆ పాస్ ఉపయోగించుకొని ఎలిమినేషన్ నుంచి బయటపడుతుందా ? లేదంటే క్లోజ్ ఫ్రెండ్ రాజ్ కోసం త్యాగం చేస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఈ ప్రోమోలో నాగార్జున ఎవిక్షన్ పాస్‌ను నీకోసం ఉపయోగించుకోవచ్చు. లేదంటే రాజ్ కోసమైనా వాడుకోవచ్చు అని ఫైమాతో చెప్పాడు. నిర్ణయాన్ని ఫైమాకే వదిలివేశాడు. ఆమె ఏం నిర్ణయించుకున్నది మాత్రం చూపించలేదు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమని తేలింది. వారు ఎవరన్నది ఈ రోజు ఎపిసోడ్‌లో డిసైడ్ కానుంది. రాజ్ ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది
ఈ ప్రోమో ఆద్యంతం సరదాగా సాగింది. కంటెస్టెంట్స్‌తో నాగార్జున ఫన్నీ గేమ్స్ ఆడించారు. ఇందులో రాజ్, ఆదిరెడ్డి హైలైట్ అయ్యారు.
రేవంత్ విన్నర్ అంటూ పోస్ట్‌లు..
కాగా శనివారం ఎపిసోడ్‌కు శివబాలాజీ, సోహెల్, రోల్ రైడా, లహరి, వితిక షేరు, ప్రభాకర్‌తో పాటు పలువురు నటీనటులు గెస్ట్‌లుగా వచ్చారు. వారందరూ రేవంత్, శ్రీహాన్‌లపై ప్రశంసలు కురిపించారు.
ముఖ్యంగా రేవంత్ ఆటతీరును బాగుదంటూ చెప్పారు. దాంతో బిగ్‌బాస్ టైటిల్ రేవంత్ సొంతం చేసుకోనున్నట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఫైనల్‌కు రేవంత్‌తో పాటుగా శ్రీహాన్, ఇనాయా, ఆదిరెడ్డి, శ్రీసత్య వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.