Thriller OTT: ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్!
Thriller OTT: ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బోగన్ విల్లియా ఈ నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెలాఖరున డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. బోగన్ విల్లియా మూవీలో కుంచకో బోబన్ మరో హీరోగా నటించాడు.
Thriller OTT: ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బోగన్‌విల్లియా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మలయాళం మూవీలో కుంచకో బోబన్ మరో హీరోగా నటించాడు. జ్యోతిర్మయి, వీణా నందకుమార్, షరాఫుద్దీన్ కీలక పాత్రల్లో నటించారు.
20 కోట్ల బడ్జెట్...
అక్టోబర్ మూడో వారంలో థియేటర్లలో రిలీజైన బోగన్ విల్లియా మూవీ మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 35 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నది. ఫహాద్ ఫాజిల్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్సయింది. లిజో జోస్ రాసిన రుతింతే లోకం నవల ఆధారంగా బోగన్ విల్లియా మూవీ రూపొందింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో...
బోగన్ విల్లియా మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నది. నవంబర్ 29న బోగన్ విల్లియా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఫహాద్ ఫాజిల్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేరళ మిస్సింగ్స్‌పై ఇన్వేస్టిగేషన్స్...
రాయిస్ (కుంచకో బోబన్), రీతూ (జ్యోతిర్మయి) భార్యభర్తలు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంఓ యాక్సిడెంట్ కారణంగా తలక్రిందులవుతుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ రీతూ గతం మొత్తం మర్చిపోతుంది.
మరోవైపు కేరళకు వచ్చిన టూరిస్ట్‌లు ఒక్కొక్కరు కనిపించకుండా పోతుంటారు. ఈ మిస్సింగ్‌లకు రీతూకు సంబంధం ఉందని ఏసీసీ డేవిడ్ కోషి (ఫహాద్ ఫాజిల్) కనిపెడతాడు. నిజంగానే రీతూతో ఈ మిస్సింగ్‌లకు సంబంధం ఉందా? ఈ మిస్టరీని ఏసీసీ డేవిడ్ ఎలా సాల్వ్ చేశాడు. ఈ క్రైమ్‌కు రాయిస్‌కు ఎలాంటి సంబంధం ఉంది అన్నదే ఈ మూవీ కథ.
ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్‌కు...
బోగన్ విల్లియా మూవీకి అమల్ నీరద్ దర్శకత్వం వహించాడు. కాన్సెప్ట్ రొటీన్ కావడం, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే కారణంగా ఈ సినిమా యావరేజ్ రిజల్ట్‌ను సొంతం చేసుకున్నది. ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబన్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో హీరోయిన్ జ్యోతిర్మయి పదేళ్ల తర్వాత మలయాళంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని కుంచకో బోబన్‌తో కలిసి ఆమె స్వయంగా నిర్మించడం గమనార్హం.
ఆవేశం వంద కోట్లు...
ఫహాద్ ఫాజిల్ గత మూవీ ఆవేశం బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. రజనీకాంత్ వేట్టయన్‌లో ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు.
సెకండ్ పార్ట్‌లో అల్లు అర్జున్‌తో పోటాపోటీగా ఫహాద్ ఫాజిల్ విలన్ క్యారెక్టర్ సాగనున్నట్లు సమాచారం. రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాణంలో రూపొందుతోన్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ చేస్తోన్నాడు. మలయాళంలో హీరోగా మూడు సినిమాలు చేస్తోన్నాడు.