f-3 Trailer | ఎఫ్- 3 ట్రైలర్ రిలీజ్...దగ్గుబాటి, మెగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్-f3 trailer out venkatesh varun tej promises a fun filled entertainer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  F3 Trailer Out Venkatesh, Varun Tej Promises A Fun Filled Entertainer

f-3 Trailer | ఎఫ్- 3 ట్రైలర్ రిలీజ్...దగ్గుబాటి, మెగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్

HT Telugu Desk HT Telugu
May 09, 2022 10:20 AM IST

వెంక‌టేష్‌,వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టించిన ఎఫ్‌-3(#F3Trailer) సినిమా ట్రైల‌ర్ సోమ‌వారం విడుద‌లైంది. ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఆహ్లాభ‌రితంగా సాగిన ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. సినిమాపై నెల‌కొన్న అంచ‌నాల్ని డ‌బుల్ చేసింది.

వెంక‌టేష్‌,వ‌రుణ్‌తేజ్
వెంక‌టేష్‌,వ‌రుణ్‌తేజ్ (twitter)

వేస‌విలో వినోదాల జ‌ల్లును కురిపించేందుకు వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ సిద్ధ‌మ‌వుతున్నారు. వారు హీరోలుగా న‌టిస్తున్న మల్టీస్టార‌ర్ చిత్రం ఎఫ్‌-3 మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల‌చేశారు.

ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు అంటూ మురళీశర్మ డైలాగ్ తో ఆసక్తికరంగా ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో వెంకటేష్(venkatesh), వరుణ్ తేజ్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. డబ్బున్న వాడికి ఫన్..లేనివాడికి ప్రస్ట్రేషన్ అంటూ చెప్పడం ఆకట్టుకుంటోంది. నత్తి సమస్యతో బాధపడే యువకుడిగా వరుణ్ తేజ్ సినిమాలో కనిపిస్తున్నారు. వారిది మరాఠీ ఫ్యామిలీ ఐతే మాది దగ్గుబాటి ఫ్యామిలీ అంటూ వెంకటేష్ చెప్పిన పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రగతి, తమన్నా, సునీల్, వెన్నెలకిషోర్ తో పాటు ప్రతి పాత్ర వినోదాన్ని పంచుతూ ట్రైలర్ లో సందడిచేశాయి. డ‌బ్బు వ‌ల్ల ఎదుర‌య్యే క‌ష్టాల‌ను వినోదాత్మ‌కంగా ట్రైల‌ర్‌లో చూపించారు.

2019లో విడుద‌లైన ఎఫ్‌-2(f2 movie)కు సీక్వెల్ గా సినిమా తెర‌కెక్కుతోంది. తొలుత ఫిబ్ర‌వ‌రిలోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు.కానీ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మ‌వ‌డం, పెద్ద సినిమాల మధ్య స‌ర్ధుబాటుతో మే నెలకు వాయిదాప‌డింది. ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్‌తో పాటు సోనాల్ చౌహాన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. పూజాహెగ్డే ప్ర‌త్యేక‌గీతంలో ఆడిపాడింది. ఈ పాట సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. సునీల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్