ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వాటిలో తెలుగుతోపాటు ఇతర భాషల మూవీస్ సైతం అలరిస్తుంటాయి. ఇక ఇటీవల కాలంలో తెలుగులోనూ ఓటీటీ కంటెంట్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఇవాళ తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కాన్సెప్ట్ మూవీ ఒకటి డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఆ సినిమానే ఏవి అలనాటి ముద్దులు. టైటిల్‌తోనే మూవీ జొనర్ ఏంటో తెలిసిపోతుంది. ఏవి అలనాటి ముద్దులు సినిమాలో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కల్యాణ్, హీరోయిన్‌గా నటాషా చేశారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో పాపులర్ అయిన అర్జున్ కల్యాణ్ స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న నువ్వుంటే నా జతగా సీరియల్‌లో హీరోగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరు తెచ్చుకున్నాడు. సీరియల్‌లో తన నటనతో అలరిస్తున్న అర్జున్ కల్యాణ్ ఏవి అలనాటు ముద్దులు ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఏవి అలనాటి ముద్దులు సినిమాకు రాంకీ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, డైరెక్షన్ సూపర్‌విజన్ అందించారు. క్రిష్ణకాంత్ డైలాగ్స్ రాయగా.. కోవెలమూడి మాధవి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
వి. కుమార కిరణ్ సంగీతం అందించిన ఏవి అలనాటి ముద్దులు ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది. ఇవాళ్టీ (జూన్ 22) నుంచి ఈటీవీ విన్‌లో ఏవి అలనాటి ముద్దులు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 30.28 నిమిషాల రన్‌టైమ్‌తో ఏవి అలనాటి ముద్దులు ఓటీటీ రిలీజ్ అయింది.
ప్రతి ఆదివారం ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధా సిరీస్‌లో భాగంగా ఏవి అలనాటి ముద్దులు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇక ఏవి అలనాటి ముద్దులు సినిమా కథలోకి వెళితే.. హీరో హీరోయిన్ గాఢంగా ప్రేమించుకుంటారు. తీరిక లేకుండా ముద్దులతో రొమాన్స్ చేస్తారు.
ఆ రొమాంటిక్ లవ్ కారణంగా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లయి పాప పుట్టాక భర్త మారిపోయాడని భార్య ఫ్రెండ్‌కు చెప్పి బాధపడుతుంటుంది. దాంతో ప్రేమలో ఉన్న పాత రోజులను గుర్తు చేసేలా చేయమని హీరోయిన్‌కు ఫ్రెండ్ సలహా ఇస్తుంది. అలా ఓ బుక్ రాస్తుంది హీరోయిన్. ఆ బుక్ పేరేంటీ? అందులో కథలు ఏంటీ? అనేదే ఏవి అలనాటి ముద్దులు మూవీ కథ.
లిప్ కిస్ వంటి మంచి రొమాంటిక్ సీన్స్‌తో ఈ సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఏవి అలనాటు ముద్దులు మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.
సంబంధిత కథనం