Everything Everywhere All At Once: హ‌య్యెస్ట్ ఆస్కార్ నామినేటెడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది -everything everywhere all at once streaming now on sony liv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Everything Everywhere All At Once Streaming Now On Sony Liv

Everything Everywhere All At Once: హ‌య్యెస్ట్ ఆస్కార్ నామినేటెడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది

Nelki Naresh Kumar HT Telugu
Mar 11, 2023 09:59 AM IST

Everything Everywhere All At Once: ఈ ఏడాది ఆస్కార్స్‌లో హ‌య్యెస్ట్ నామినేష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజైందంటే...

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్

Everything Everywhere All At Once: 95వ ఆస్కార్స్‌లో అత్య‌ధిక నామినేష‌న్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్ సినిమా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేష‌న్స్‌ను పొందిన ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం సోని లివ్ ఓటీటీలో ఈ సినిమా రిలీజైంది.

ఈ విష‌యాన్ని సోని లివ్ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆస్కార్ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వానికి ఒక‌రోజు ముందు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది ఆస్కార్స్‌లో బెస్ట్ పిక్చ‌ర్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ హీరోయిన్‌తో పాటు మొత్తం ప‌ద‌కొండు విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయ్యి చ‌రిత్ర‌ను సృష్టించింది.

ఈ ఏడాది అత్య‌ధిక ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న‌ సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు డేనియ‌ల్ క్వాన్‌, డేనియ‌ల్ స్కీనెర్ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్యార‌లాల్ యూనివ‌ర్స్ అనే పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది.

14 మిలియ‌న్ల బ‌డ్జెట్‌తో రూపొందించిన‌ ఈ సినిమా 100 మిలియ‌న్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మ‌నిషిని పోలిన మ‌నుషులు మిగిలిన ప్యార‌లాల్ యూనివ‌ర్స్‌ల‌లో ఉంటార‌నే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.