Jani Master: వారిని చూస్తుంటే జాలేస్తుంది - జానీ మాస్టర్ ట్వీట్ వైరల్ - యాంకర్ ఝాన్సీ పోస్ట్ గురించేనా?
Jani Master: జానీ మాస్టర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ జానీ మాస్టర్ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసిందని నటి, యాంకర్ ఝాన్సీ ఓ పోస్ట్ పెట్టింది. ఝాన్సీ ట్వీట్‌పై జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు.
జానీ మాస్టర్ కేసు మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసిందని ఇదొక గొప్ప తీర్పు అంటూ నటి, యాంకర్ ఝాన్సీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఝాన్సీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఝాన్సీ పోస్ట్‌పై జానీ మాస్టర్ కూడా రియాక్ట్ అయ్యాడు. తమ సొంత లాభం కోసం కొందరు కోర్టు ఆర్డర్లు మార్చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఓ ట్వీట్ చేశాడు.

ఝాన్సీ పోస్ట్‌లో ఏముంది?
ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ కేసు వేశారు. ఈ కేసులో ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది. జానీ భాషా పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. పని చేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉంటుందని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది అని ఝాన్సీ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. ధర్మం వైపు నిలబడి న్యాయపోరాటం చేసేందుకు సహకారం అందించిన ఫిల్మ్ ఛాంబర్‌కు కృతజ్ఞతలు అంటూ ఝాన్సీ తెలిపింది.
డ్యాన్స్ మాస్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. చాలా రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న అతడు బెయిల్‌పై రిలీజయ్యాడు. ఆ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసినట్లు ప్రచారం జరుగుతోంది.
జానీ మాస్టర్ రియాక్ట్...
ఝాన్సీ ట్వీట్‌పై జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు. ఈ ట్వీట్‌లో ఆమె పేరు మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుందని తన ట్వీట్‌లో జానీ మాస్టర్ పేర్కొన్నాడు.
డ్యాన్సర్స్ యూనియన్ ఎలక్షన్స్…
ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు.న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది అని జానీ మాస్టర్ ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వివాదంలో ఝాన్సీ పోస్ట్ ఒకలా ఉంటే...జానీ మాస్టర్ ట్వీట్ మరోలా ఉండటం ఆసక్తికరంగా మారింది