ETV Win OTT: పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. కార్టూన్ షోలు వచ్చేస్తున్నాయ్.. ఒకేసారి ఐదు స్ట్రీమింగ్-etv win ott soon to start cartoon shows adventure fun cartoon etv bal bharat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Etv Win Ott: పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. కార్టూన్ షోలు వచ్చేస్తున్నాయ్.. ఒకేసారి ఐదు స్ట్రీమింగ్

ETV Win OTT: పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. కార్టూన్ షోలు వచ్చేస్తున్నాయ్.. ఒకేసారి ఐదు స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu
Published Feb 17, 2025 07:27 PM IST

ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీ ఇప్పుడు పిల్లలను ఆకర్షించే పనిలో పడింది. త్వరలోనే ఈ ఓటీటీలో పాపులర్ కార్టూన్ షోలు రాబోతున్నాయి. ఒకేసారి ఐదు షోలను స్ట్రీమింగ్ చేయనున్నారు.

పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. కార్టూన్ షోలు వచ్చేస్తున్నాయ్.. ఒకేసారి ఐదు స్ట్రీమింగ్
పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. కార్టూన్ షోలు వచ్చేస్తున్నాయ్.. ఒకేసారి ఐదు స్ట్రీమింగ్

ETV Win OTT: ఓటీటీ అంటే పెద్ద వాళ్లకే కాదు.. చిన్న పిల్లలకు కూడా. చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేకంగా షోలను తీసుకొచ్చాయి. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ కూడా కార్టూన్ షోలతో రాబోతోంది. ఫిబ్రవరి 27 నుంచి ఒకేసారి ఐదు కార్టూన్ షోలను ఆ ఓటీటీ అనౌన్స్ చేయడం విశేషం.

ఈటీవీ విన్ ఓటీటీ కార్టూన్ షోస్

ఈటీవీ విన్ ఓటీటీ ఈ మధ్యకాలంలో వరుసగా ఒరిజినల్ మూవీస్, షోలతో దూసుకెళ్తోంది. ఎక్స్‌క్లూజివ్ గా తెలుగు కంటెంట్ కోసమే వచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన ఈటీవీ విన్.. ఇప్పుడు పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా కార్టూన్లను తీసుకువస్తోంది. ఈ విషయాన్ని సోమవారం (ఫిబ్రవరి 17) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఫిబ్రవరి 27 నుంచి ఐదు సరికొత్త కార్టూన్ షోలను స్ట్రీమింగ్ చేయనుంది. అంతేకాదు వీటన్నింటి తొలి ఎపిసోడ్లను ఫ్రీగా చూసే అవకాశం కూడా కల్పించారు. “త్వరలోనే ఫన్ మొదలు కాబోతోంది. ఈ ఫిబ్రవరి 27న మీ ఫేవరెట్ కార్టూన్ షోలు మీ ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తున్నాయి సిద్ధంగా ఉండండి. సరదా, నవ్వులు, మ్యాజిక్ తో కూడిన అడ్వెంచర్ కోసం రెడీ అయిపోండి” అనే క్యాప్షన్ తో ఈ షోలను అనౌన్స్ చేసింది.

ఈటీవీ విన్‌లోకి రానున్న కార్టూన్ షోలు ఇవే

పాపులర్ జపనీస్ కార్టూన్ షో డిటెక్టివ్ కోనన్ ను కూడా ఇప్పుడు ఈటీవీ విన్ తెలుగులో తీసుకురాబోతోంది. 1996 నుంచి ఈ షో నడుస్తోంది. ఇప్పటికే 31 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ తీసుకొచ్చే సిరీస్ లో తొలి ఎపిసోడ్ ను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది.

ఇదే కాకుండా ది సిస్టర్స్, బాల్ బాహుబలి ది లాస్ట్ సన్ గార్డియన్, అభిమన్యు ది యంగ్ యోధా, కిట్టీ ఈజ్ నాట్ ఎ క్యాట్ సీజన్ 3లాంటి కార్టూన్ షోలు కూడా ఫిబ్రవరి 27 నుంచే ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తున్నాయి. వీటన్నింటి తొలి ఎపిసోడ్లను ఫ్రీగా చూడొచ్చు. ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడంతోపాటు ఒరిజినల్ మూవీస్ విషయంలోనూ ఈ ఓటీటీ దూకుడుగా వెళ్తోంది. తాజాగా కార్టూన్ షోలతో పిల్లలూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం