OTT Movies In February: ఓటీటీలో సినిమాల జాతర.. ఫిబ్రవరిలో ఒకేదాంట్లో 40 మూవీస్.. ఇక్కడ చూసేయండి!
ETV Win OTT Movies Release In February: ఓటీటీలో ఫ్రిబ్రవరిలో సినిమాల జాతర జరగనుంది. ఒక్క ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ నెలలో ఏకంగా 40 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో ఒకటి, రెండు తేదీల్లో కుప్పలు తెప్పలుగా సినిమాలు పడనున్నాయి. మరి అవేంటీ, వాటి రిలీజ్ డేట్స్ ఏంటో లుక్కేయండి.
ETV Win OTT Movies Release In February: ఇండియాలో ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతున్నాయి. వాటిలో కేవలం తెలుగు కంటెంట్‌ను మాత్రమే ఇచ్చే రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటి ఈటీవీ విన్.

ఫిబ్రవరి ఓటీటీ సినిమాలు
చిన్న సినిమాలను ఆదరిస్తూ ఈటీవీ విన్‌లో సరికొత్త కంటెంట్‌తో అలరిస్తోంది. అయితే, తాజాగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు, వాటి స్ట్రీమింగ్ డేట్‌ను సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్. తేదీలా వారిగా ఇచ్చిన ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
ఫిబ్రవరి 6
అలా మొదలైంది
అతడు
బేవర్స్
బిచ్చగాడ మజాకా
బ్లఫ్ మాస్టర్ట్
బాడీ గార్డ్
క్రేజీ ఫెలో
ఫిదా
ఖాకీ
మోసగాళ్లకు మోసగాడు
ఊరు పేరు భైరవకోన
పాండురంగడు
సింహా
తరువాత ఎవరు
టాప్ గేర్
వాన
ఫిబ్రవరి 20
ఎవడు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
శ్రీ రామదాసు
చింతకాయల రవి
స్టాలిన్
రామయ్య వస్తావయ్యా
నాగవల్లి
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
మొగుడు
అదిరిందయ్య చంద్రం
లవ్‌లీ
కేడి
అదుర్స్
సోలో
కొంచెం ఇష్టం కొంచెం కష్టం
ఫిబ్రవరి 13- సమ్మేళనం
ఫిబ్రవరి 27- కౌసల్య సుప్రజ రామ
ఫిబ్రవరి 28
దడ
నేను నా రాక్షసి
కేరాఫ్ సూర్య
ప్రేమికులు
షాక్
రాణి గారి బంగ్లా
న్యాయం కావాలి
40 సినిమాలు
ఇలా మొత్తంగా ఫిబ్రవరి నెలలో ఈటీవీ విన్‌లో 40 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఫిబ్రవరి 6 ఒక్కరోజే 16, 20వ తేదినాడు 15, ఫిబ్రవరి 28న 7 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే, ఇవన్ని పాత సినిమాలే. కానీ, సమ్మేళనం, కౌసల్య సుప్రజ రామ రెండు సినిమాలు కొత్తవిలా ఉన్నాయి.
డీడీ ప్లస్ ఆడియోతో
ఇక ఈటీవీ విన్ అధికారికా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ఈ పోస్ట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "యూట్యూబ్‌లో ఉన్నాయి కదా ఈ మూవీస్ అన్నీ", "ఆ ఫిబ్రవరి 6 రిలీజ్ టైటిల్స్ అన్ని తిట్లులా ఉన్నాయి" అని సెటైర్లు వేస్తే.. మరికొందరు "సినిమాలన్నింటిని ఒరిజినల్ క్వాలిటీ, డీడీ ప్లస్ ఆడియోతో అప్‌లోడ్ చేస్తున్నారు" అని రాసుకొస్తున్నారు.
హై క్వాలిటీతో
అయితే, పాత సినిమాలను హై క్వాలిటీ వీడియోతో తెలుగు ఆడియెన్స్‌కు అందించే ప్రయత్నం ఈటీవీ విన్ చేస్తోందని సమాచారం. అలాగే, మంచి క్వాలిటీ ఆడియో అయినా డీడీ ప్లస్ టెక్నాలజీతో పాత సినిమాల కొత్త వెర్షన్‌ను తిరిగి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
సంబంధిత కథనం