ETV Win Web Series: ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. న్యూ ఇయర్ రోజే టీజర్
ETV Win Web Series: ఈటీవీ విన్ ఓటీటీ మరో ఒరిజినల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందంటూ.. టీజర్ రిలీజ్ విషయాన్ని వెల్లడించింది. ఇది కూడా యువతను ఆకట్టుకునేలా నేటితరం ర్యాంకర్స్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది.
ETV Win Web Series: ఈటీవీ విన్ ఈ మధ్య దూకుడు పెంచుతోంది. తన ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలా తాజాగా ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR) అనే మరో వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. కొన్నాళ్ల కిందట ఈ సిరీస్ ను అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా 2024 చివరి రోజు అయిన మంగళవారం (డిసెంబర్ 31) ఈ సిరీస్ టీజర్ రిలీజ్ విషయంపై ఓ అప్డేట్ ఇచ్చింది.
ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్
ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతున్న వెబ్ సిరీస్ పేరు ఆల్ ఇండియా ర్యాంకర్స్ (All India Rankers). ఈ సిరీస్ కు సంబంధించిన అప్డేట్ ను మంగళవారం ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. ఎయిరింగ్(AIRing) సూన్.
ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈటీవీ విన్ నుంచి మీ తర్వాతి ఫేవరెట్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో టీజర్ రిలీజ్ విషయాన్ని తెలిపింది. ఈ సిరీస్ టీజర్ బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా తీసుకురానున్నారు. ఈ కొత్త పోస్టర్ డిఫరెంట్ గా ఉంది. ఇందులో ముగ్గురు స్టూడెంట్స్ మేకలను కూడా చూడొచ్చు.
ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ గురించి..
ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ కోసం కొన్నాళ్ల కిందట ఈటీవీ విన్ కొత్త నటీనటుల కోసం ఓ క్యాస్టింగ్ కాల్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 19న రోషన్ బర్త్ డే సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది.
ప్రముఖ దర్శకుడు, కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ ఈ సిరీస్ ను సమర్పిస్తున్నాడు. ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ ను జోసెఫ్ క్లింటన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అర్జున్ అనే ఓ యువ నటుడు లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ప్రముఖ తెలుగు నటీనటులు కూడా ఇందులో నటించనున్నట్లు ఆ మధ్య సమాచారం బయటకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఈటీవీ విన్ వెల్లడించలేదు. త్వరలోనే అని మాత్రం తాజా అప్డేట్ లో వెల్లడించింది. జనవరి చివర్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.