survival Drama OTT: తెలుగులోకి వచ్చిన తమిళ్ రోడ్ జర్నీ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?
Survival Drama OTT: కోలీవుడ్ రోడ్ జర్నీ థ్రిల్లర్ మూవీ మిన్ మినీ తెలుగులోకి వచ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది.
Survival Drama OTT: దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ మిన్‌మినీ తెలుగులోకి వచ్చింది. రోడ్ జర్నీ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మిన్‌మినీ ఓటీటీలోకి విడుదలైన సంగతిని ఈటీవీ విన్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. సినిమా పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.

ప్రొడ్యూసర్‌గా సినిమాటోగ్రాఫర్...
మిన్‌మినీ మూవీలో ఎస్తేర్ అనిల్‌తో పాటు ప్రవీణ్ కిషోర్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు హలీతా షమీమ్ దర్శకత్వం వహించారు. ఆర్ మురళీ కృష్ణన్‌తో కలిసి సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మిన్‌మినీ సినిమాను నిర్మించారు. ప్రొడ్యూసర్‌గానే కాకుండా ఈ సినిమాకు కెమెరామెన్‌గా మనోజ్ పరమహంస పనిచేశారు.
డైరెక్ట్‌గా ఓటీటీలో...
గత ఏడాది ఆగస్ట్‌లో తమిళంలో థియేటర్లలో రిలీజైన మిన్‌మినీ మూవీ విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్నది. ఎస్తేర్ అనిల్ యాక్టింగ్, విజువల్స్, మ్యూజిక్ బాగున్నాయంటూ క్రిటిక్స్‌తో పాటు ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. కానీ కమర్షియల్ మాత్రం ఈ సినిమా సరైన విజయాన్ని అందుకోలేకపోయింది.
తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో ఈ సినిమా 9.1 రేటింగ్‌ను దక్కించుకున్నది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ మ్యూజిక్ అందించింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే ఖతీజా రెహమాన్‌కు డెబ్యూ మూవీ కావడం విశేషం.
ఫస్ట్ హాఫ్ 2015...సెకండాఫ్ 2022లో...
తమిళనాడు నుంచి హిమలయాల వరకు బైక్స్‌పై ఓ యువ జంట కలిసి సాగించిన జర్నీ నేపథ్యంలో దర్శకురాలు హలీతా షమీమ్ మిన్‌మినీ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ను 2015లో, సెకండాఫ్‌ను 2022లో షూట్ చేశారు డైరెక్టర్. చైల్డ్‌హుడ్ క్యారెక్టర్స్ చేసిన ఎస్తేర్ అనిల్, ప్రవీణ్ కిషోర్ టీనేజ్ ఏజ్‌లోకి పెట్టే వరకు వేచిచూడం కోసం ఏకంగా ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నారు.
హీరోహీరోయిన్ల జర్నీని రియాలిటీగా చూపించాలనే దర్శకురాలు ఈ ప్రయోగం చేశారు...యాక్టర్స్‌ను మార్చకుండా వారి రియల్ ఏజ్ ప్రకారం షూటింగ్‌ను జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా మిన్‌మినీ నిలిచింది. అంతే కాకుండా ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఇండియన్ మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
మిన్‌మినీ కథ ఇదే...
శబరి (ప్రవీణ్ కిషోర్) చెస్ ప్లేయర్. అతడి స్కూల్‌లో పరి అనే స్నేహితుడు ఉంటారు. స్పోర్ట్స్ కారణంగా ఇద్దరు చదువులో వెనుకబడిపోతారు. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా శబరికి పరి దూరమవుతాడు. స్నేహితుడు దూరమైన బాధ నుంచి బయటపడటానికి బైక్‌పై హిమాలయాలకు బయలుదేరుతాడు శబరి. ప్రవీణకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుంది.
లైఫ్‌లో తనకు సెకండ్ ఛాన్స్ రావడంతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి బైక్ జర్నీ మొదలుపెడుతుంది. ఈ జర్నీలో శబరి, ప్రవీణ మధ్య ఎలా పరిచయం ఏర్పడింది? హిమాలయాలకు చేరుకునే క్రమంలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే మిన్‌మినీ మూవీ కథ.
టాపిక్